Pan India Stars: టాప్ 10 పాన్ ఇండియా హీరోలు వీళ్లే.. ఆర్ఆర్ఆర్ హీరోలకు భారీ షాక్!

Pan India Stars: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇలా సినిమాలన్నీ కూడా వివిధ భాషలలో విడుదల అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఒకప్పుడు కేవలం ఒక భాషకు మాత్రమే పరిమితమైన సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ప్రతి ఒక్క హీరో కూడా పాన్ ఇండియా స్టార్ట్ ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది పాన్ ఇండియా స్టార్ హీరోలు గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆర్మాక్స్ మీడియా సంస్థ అత్యధిక పాపులర్ అయినటువంటి టాప్ 10 పాన్ ఇండియా హీరోల జాబితా విడుదల చేసింది.

ఇక ఈ జాబితాలో మొదటి స్థానంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నిలవగా రెండో స్థానంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నిలిచారు. ఇక మూడో స్థానంలో కోలీవుడ్ నటుడు విజయ్ దళపతి నిలిచారు. ఇక నాలుగో స్థానంలో మహేష్ బాబు ఉండటం విశేషం ఈయన పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా రాజమౌళితో సినిమా చేస్తున్నారని తెలిసి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నారు.

చివరి స్థానంలో RRR హీరోలు..
ఇక ఐదవ స్థానంలో అక్షయ్ కుమార్ ఆరో స్థానంలో సల్మాన్ ఖాన్ ఏడో స్థానంలో హృతిక్ రోషన్ ఉన్నారు ఇక ఎనిమిదో స్థానంలో అల్లు అర్జున్ నిలువగా తొమ్మిదవ స్థానంలో ఎన్టీఆర్ పదవ స్థానంలో రామ్ చరణ్ నిలిచారు. అయితే ఈ ఇద్దరు హీరోలు కూడా RRR సినిమా ద్వారా ఆస్కార్ అవార్డును అందుకోవడమే కాకుండా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు. కానీ ఈ సర్వేలో ఇద్దరు హీరోలు చివరిలో ఉండటంతో అభిమానులు షాక్ అవుతున్నారు.