Kajal Agarwal: వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇక త్వరలోనే ఈమె నటించిన సత్యభామ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా జూన్ 7వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇలా వరుస ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నటువంటి కాజల్ అగర్వాల్ కు ఒక ఇంటర్వ్యూలో ఆచార్య సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ నటించారు.
ఇక ఈ సినిమా విడుదల సమయంలో కాజల్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలన్నింటిని కూడా తొలగించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి ఆ సమయంలో కూడా కాజల్ మౌనంగా ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెకు ఆచార్య సినిమాలో మీ పాత్రగా తీసివేయడంపై మీ రియాక్షన్ ఏంటి అనే ప్రశ్న ఇటీవల ఈమెకు ఎదురయింది.
ఫీల్ అయ్యాను…
ఈ ప్రశ్నకు కాజల్ సమాధానం చెబుతూ.. ఇట్స్ ఓకే, జరిగేందో జరిగింది. దానికి నేనేం చేస్తాను, మీ లాగే నేను కూడా ఫీల్ అయ్యాను. కానీ ఏం చేస్తాం. ఆ విషయాన్ని అప్పుడే మైండ్ లో నుంచి డిలీట్ చేశాను. కానీ నా పాత్ర ఎందుకు తీసేసారు ఏంటి అనేది నాకు తెలియదు వారిని కూడా అడగలేదు అడగాల్సిన అవసరం కూడా నాకు లేదని కాజల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…