Prabhas Sreenu : కృష్ణంరాజు గారు చనిపోయినపుడు ప్రభాస్ కన్నీళ్లు పెట్టడం చూసి మాకు కన్నీళ్లు వచ్చాయి అంటూ లైవ్ లోనే ఏడ్చేసిన ప్రభాస్ శీను…

Prabhas Sreenu : ప్రభాస్ శ్రీను, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా, విలన్ గా కూడా నటించి అభిమానులకు దగ్గర అయ్యాడు. ప్రభాస్ శ్రీను ఇప్పటి వరకు దాదాపు 150 చిత్రాలలో నటించాడు. హీరో ప్రభాస్ తో వున్న స్నేహం కారణంగానే ఈయనకు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ శ్రీను అన్న పేరు వచ్చింది. 2002 లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో పరిచయమైన వీళ్ళ స్నేహం ఇప్పటికి కొనసాగుతోంది. సినిమా ఇండస్ట్రీకి సంబందించి స్నేహం గురించి చెప్పుకోవాలి అంటే వీరిద్దరి గురించి మాట్లాడుకుంటారు. ఈయన తాజాగా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ శ్రీను ఆసక్తికర విషయాలు మాట్లాడారు.

కృష్ణంరాజు గారు చనిపోయినపుడు ప్రభాస్ ను తలుచుకొని లైవ్ లో ఏడ్చేసిన శ్రీను……

తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ శ్రీను, హీరో ప్రభాస్ తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో మొదలైన మా స్నేహం ఇప్పటికి అలాగే ఉందని, పాన్ ఇండియా స్టార్ అయిన కూడా ప్రభాస్ లో కొంచంకూడా తేడా కనిపించలేదు అని చెప్పుకొచ్చారు. నేను బాహుబలి తరువాత ప్రభాస్ ముందులా ఉంటాడా లేదా అన్న ఆలోచన నాకు వచ్చింది కానీ ఆయన లో అసలు మార్పు లేదని ఎప్పటికి రాదనీ చెప్పారు.

ఇక కృష్ణం రాజు గురించి మాట్లాడుతూ…. ఆయన అంత గొప్ప వ్యక్తి అయినా కూడా ఇంటికి వెళ్తే బయట వ్యక్తి అన్న బేధం చూపేవారు కాదని చాలా ఆప్యాయంగా పలకరించేవారని చెప్పారు. ఆయన చుట్టూ వున్న వాళ్ళతో సరదాగా గడపడం, వారికి కడుపు నిండా భోజనం పెట్టడం ఆయనకు ఇష్టం అని చెప్పారు. ప్రభాస్ కి కృష్ణం రాజు గారు అంటే చాలా ఇష్టం అని వారిద్దరూ తండ్రి కొడుకులు లాగా కాకుండా స్నేహితులుగా ఉండేవారని చెప్పుకొచ్చారు. ఆయన చనిపోయిన రోజు ప్రభాస్ కన్నీరు పెట్టుకోవడం చుస్తే మాకు ఏడుపు వచ్చేసిందని లైవ్ లోనే ఎమోషనల్ అయ్యారు.