కావాలనే నన్ను వివాదంలోకి లాగుతున్నారు.. ఆ సన్నివేశంలో తప్పేంటి: ప్రకాష్ రాజ్

ఇటీవల సూర్య హీరోగా నటించిన జై భీమ్ విజయవంతంగా అమెజాన్ ఓటీటీలో రన్ అవుతోంది. టాప్ లో ఆ సినిమా ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. దీనిలో రావు రమేష్, సూర్య మధ్య జరిగే సన్ని వేశాలు అమోఘం అని చెప్పాలి. వీరిద్దరు వకీల్ పాత్రలో నటించారు. ఇక చిన్నతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ జోస్ అద్భుతంగా నటించింది.

ఆమె డీ గ్లామర్ గా మారి తన నటనతో అందరి మన్ననలు పొందింది. ఒక లాయర్ చంద్రు నిజ జీవిత కథ ఆధారంగా తీసినది ఈ సినిమా. జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు సమాజంలో వైరల్ గా మారింది. ఈ సినిమాపై వస్తున్న పాజిటివ్ స్పందన చూస్తుంటే మంచి కథలు తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపించారు.

అయితే దీనిలో ఓ సన్నివేశం కొంతమంది వివాదం స్పష్టిస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్ సీబీఐ ఎంక్వైరీ చేసే ఆఫీసర్ పాత్రలో నటించాడు. దీనిలో ఓ వ్యక్తిని విచారించే క్రమంలో అతడు హిందీలో మాట్లాడుతుంటాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ అతడిని తెలుగులో మాట్లాడు అంటూ చెంప దెబ్బ కొట్టి హెచ్చరిస్తాడు. ఇది హిందీ భాషను అవమానించడమే అంటూ కొందరు విమర్శిస్తున్నారు. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందించాడు.

దీనిలో అణగారిన వర్గాల బాధని పూర్తిగా చూపించామని.. వాళ్లు పడే ఇబ్బందులు, కష్టాలను చూపించామన్నారు. ఇవన్ని పక్కన పెట్టేసి కేవలం చెంపదెబ్బ సన్నివేశంపైనే దృష్టి పెట్టారంటే వాళ్ల అజెండా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. తాను ఈ సినిమాలో నటించాన్న కారణంతోనే ఎక్కువగా సినిమాను వివాదంలోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటువంటి వివాదాలకు స్పందించడం .. ఎలాంటి అర్థం లేదంటూ చెప్పుకొచ్చాడు.