ఇటీవల కాలంలో ప్రేమ, పెళ్లి పేరుతో యువతులు మోస పోతున్నారు. దీంతో పోలీస్ స్టేషన్లో ఇలాంటి కేసులు కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతున్నాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఇద్దరు కలిసి చెట్టా పట్టాలేసుకొని తిరిగి .. చివరకు పెళ్లి మాట ఎత్తితే ముఖం చాటేసే మోసగాళ్లు ఈ మధ్య ఎక్కువయ్యారు.
అలాంటి వారికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ.. పెజ్జోనిపేటకు చెందిన ఓ యువతి ప్రైవేటు కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది.
మొదట్లో తన తోటి మహిళలతో స్నేహం చేసిన సదరు యువతి.. తర్వాత తన క్లాస్ కు చెందిన యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయాన్ని అతడు తనకు అనుకూలంగా మార్చుకున్నాడు తోటి విద్యార్థి సుహృద్. ప్రేమిస్తున్నట్లు వెంట పడ్డాడు. ఆమె మొదట నిరాకరించింది. పెళ్లి చేసకుంటానని నమ్మించాడు.
తర్వాత ఆమెను తీసుకొని బయట తిరగడం ప్రారంభించాడు. ఇలా పలుమార్లు ఆమెపై లైగికంగా దగ్గరయ్యాడు. తర్వాత ఓ రోజు సదరు యువతి పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయగా అతడి నిజ స్వరూపం బయటపడింది. ఒత్తిడి ఎక్కువగా రావడంతో ఆమెకు దూరంగా ఉంటూ.. తప్పించుకొని తిరగడం ప్రారంభించాడు. దీంతో యువతి తనను మోసం చేశాడని తెలుసుకొని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో అతడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…