ఆయన చెప్పారు.. అందుకే మళ్లీ ట్విట్టర్ లోకి: బండ్ల గణేష్

కమెడియన్ గా తన కెరీర్ ను మొదలు పెట్టి ప్రస్తుతం బడా నిర్మాతగా ఎదిగారు బండ్ల గణేష్. అతడు సోషల్ మీడియా ద్వారా ఏ పోస్టు పెట్టినా తెగ వైరల్ అవుతుంటుంది. ఇటీవల తను ట్విట్టర్ కు దూరంగా ఉంటానని.. పోస్టు చేయడంతో తన ఫాలోవర్స్, అభిమానులు ఏమైందంటూ తెగ రీట్వీట్ చేశారు.పలువురు నెటిజన్లు ఆయనను సోషల్ మీడియాలో కొనసాగాలని కోరారు. అయితే తాజాగా అతడు మరో పోస్ట్ పెట్టి ఫ్యాన్స్ కు శుభవార్తను అందించారు.

కాటమరాయుడు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ప్రసంగంలో ఓ పాయింట్ ను ప్రభుత్వం పరీక్షల్లో అడిగారు. దానిని నెటిజన్ ఇలా ట్యాగ్ చేశాడు.. గోపాల గోపాల సినిమా ఈవెంట్‌లో ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న దేశభక్తుడు ఎవరనే ప్రశ్నను బండ్ల గణేష్ ప్రసంగంలో అడిగినట్లు అది ఎగ్జామ్‌లో అడుగుతున్నారని.. ఇలా అతని స్పీచ్ కూడా ఉపయోగపడుతున్నది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. అది గోపాల గోపాల ఈవెంట్ కాదు.. కాటమరాయుడు అంటూ బండ్ల గణేష్ సరిద్దిద్దారు.

పవన్ నటించిన భీమ్లా నాయక్ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ చేయగానే బండ్ల గణేష్ తన స్టైల్‌లో స్పందించారు. దేవర వేట మొదలైందంటూ కామెంట్ చేశారు. అయితే అంతక ముందు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పిన బండ్ల గణేష్.. మరోసారి ట్వీట్ చేశారు. తాను సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్‌లో కొనసాగుతాను అంటూ స్పష్టం చేశారు. అభిమానులు, సన్నిహితుల సూచనలను పాటిస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ కూడా చేసి కన్ఫర్మ్ చేశారు.

తన నిర్ణయాన్ని చాలామంది ఒప్పుకోలేదని.. అందులో జర్నలిస్టు సతీష్ బాబు గారు ఒకరు అంటూ తెలిపారు. ఈరోజు ప్రజలకి సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉండమని నాకు సలహా ఇచ్చారు. వారు ఇచ్చిన సలహాను గౌరవంగా భావించి మీ అందరి ముందుకి మళ్ళీ వస్తున్నాను అంటూ గుడ్ న్యూస్ అందించారు. ఇదిలా ఉండగా..ఇక కెరీర్ పరంగా చాలా రోజుల నుంచి సీనీ నిర్మాణానికి దూరంగా ఉన్నారు బండ్ల గణేష్. త్వరలోనే పవన్ కల్యాణ్‌తో సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.