గోల్డ్ లోన్ తీసుకునే వాళ్లకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. గోల్డ్ లోన్లపై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. తక్కువ వడ్డీకే ఎస్బీఐ బంగారం రుణాలను ఇస్తోంది. ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా రుణాలు ఇస్తున్నప్పటికీ వాటితో పోలిస్తే ఎస్బీఐ తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్లను ఇస్తూ ఉండటం గమనార్హం. ఎస్బీఐ 7.5 శాతం వడ్డీకి బంగారంపై రుణాలు ఇస్తోంది.

ఎస్బీఐలో గోల్డ్ లోన్లతో పాటు హౌసింగ్ లోన్లను తక్కువ వడ్డీకే ఇస్తూ ఉండటం గమనార్హం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.5 శాతం వడ్డీకి ఖాతాదారులకు గృహ రుణాలను మంజూరు చేస్తోంది. అయితే ఎస్బీఐతో పాటు మరికొన్ని బ్యాంకులు సైతం గోల్డ్ లోన్లపై అదిరిపోయే ఆఫర్లు ఇస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులు ఎస్బీఐతో పోల్చి చూస్తే తక్కువ వడ్డీకే గృహ రుణాలను ఇస్తున్నాయి.

పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌ లో బంగారం రుణాలపై వడ్డీరేటు 7 శాతంగా ఉంది. అన్ని బ్యాంకులతో పోల్చి చూస్తే ఈ బ్యాంక్ లోనే అతి తక్కువ వడ్డీకి గోల్డ్ లోన్ లభిస్తోంది. అయితే ఈ రెండు బ్యాంకులకు పెద్దగా బ్రాంచ్ లు లేవు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రం చిన్న టౌన్లలో కూడా బ్రాంచ్ లు ఉంటాయి కాబట్టి సులభంగా గోల్డ్ లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది.

చాలామంది గోల్డ్ లోన్ కోసం ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే వాటితో పోలిస్తే బ్యాంకుల నుంచి గోల్డ్ లోన్ తీసుకోవడం ద్వారా తక్కువ వడ్డీకే రుణాన్ని పొందవచ్చు. గోల్డ్ లోన్ అవసరమైన పక్షంలో సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించి రుణం తీసుకోవడం ఉత్తమం.