దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. గోల్డ్ లోన్లపై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. తక్కువ వడ్డీకే ఎస్బీఐ బంగారం రుణాలను ఇస్తోంది. ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా రుణాలు ఇస్తున్నప్పటికీ వాటితో పోలిస్తే ఎస్బీఐ తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్లను ఇస్తూ ఉండటం గమనార్హం. ఎస్బీఐ 7.5 శాతం వడ్డీకి బంగారంపై రుణాలు ఇస్తోంది.
ఎస్బీఐలో గోల్డ్ లోన్లతో పాటు హౌసింగ్ లోన్లను తక్కువ వడ్డీకే ఇస్తూ ఉండటం గమనార్హం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.5 శాతం వడ్డీకి ఖాతాదారులకు గృహ రుణాలను మంజూరు చేస్తోంది. అయితే ఎస్బీఐతో పాటు మరికొన్ని బ్యాంకులు సైతం గోల్డ్ లోన్లపై అదిరిపోయే ఆఫర్లు ఇస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులు ఎస్బీఐతో పోల్చి చూస్తే తక్కువ వడ్డీకే గృహ రుణాలను ఇస్తున్నాయి.
పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ లో బంగారం రుణాలపై వడ్డీరేటు 7 శాతంగా ఉంది. అన్ని బ్యాంకులతో పోల్చి చూస్తే ఈ బ్యాంక్ లోనే అతి తక్కువ వడ్డీకి గోల్డ్ లోన్ లభిస్తోంది. అయితే ఈ రెండు బ్యాంకులకు పెద్దగా బ్రాంచ్ లు లేవు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రం చిన్న టౌన్లలో కూడా బ్రాంచ్ లు ఉంటాయి కాబట్టి సులభంగా గోల్డ్ లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది.
చాలామంది గోల్డ్ లోన్ కోసం ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే వాటితో పోలిస్తే బ్యాంకుల నుంచి గోల్డ్ లోన్ తీసుకోవడం ద్వారా తక్కువ వడ్డీకే రుణాన్ని పొందవచ్చు. గోల్డ్ లోన్ అవసరమైన పక్షంలో సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించి రుణం తీసుకోవడం ఉత్తమం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…