దేవదాసు సినిమా ద్వారా రామ్ పోతినేని ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమానే ఎంతో ఘన విజయం సాధించడంతో రామ్ కు తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. గతేడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఇస్మార్ట్ శంకర్” సినిమాలో మాస్ క్యారెక్టర్లో నటించి ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇదే దూకుడుతో రామ్ తరువాత” రెడ్” అనే చిత్రం ద్వారా అదే ఎనర్జీ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
రెడ్ అనే ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో దర్శకుడు తిరుమల కిషోర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ నటించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయకుండా నేరుగా థియేటర్లలోనే విడుదల చేయాలని చిత్రబృందం భావించారు.
ఈ సినిమాను సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ చేయాలని భావించిన చిత్రబృందం ఈ నెల 24న
రెడ్’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలుపుతూ అందుకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ సంక్రాంతి బరిలోకి రానున్న తన మూడవ చిత్రం” రెడ్” అని తెలిపారు. సంక్రాంతి బరిలోకి మొదటగా “దేవదాస్”, “మస్కా”చిత్రాలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని తెలిపారు.
ఈ చిత్ర నిర్మాణం పూర్తయి దాదాపు చాలా రోజులు అవుతున్నప్పటికీ ఈ త్రిల్లర్ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఎదురు చూశామని, అందుకోసమే సంక్రాంతికి సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రేక్షకులు రామ్ నుంచి ఏవైతే కోరుకుంటున్నారు ఆ అంశాలన్నీ ఈ సినిమాలో చూడవచ్చని ఈ సినిమా నిర్మాత రవికిషోర్ తెలిపారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయని నిర్మాత తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…