ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాల్లో అమ్మఒడి స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రంలోని 80 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం ప్రయోజనం చేకూరుస్తోంది. రాష్ట్రంలోని దాదాపు 43 లక్షల మంది తల్లుల ఖాతాలలో జగన్ సర్కార్ అమ్మఒడి స్కీమ్ కు సంబంధించిన నగదును జమ చేస్తోంది. అమ్మఒడి స్కీమ్ కు ఎంపికైన లబ్ధిదారుల ప్రాథమిక జాబితాను విడుదల చేసింది.
రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ మేరకు ఒక ప్రకటనలో వెల్లడించారు. గ్రామ, వార్డ్ సచివాలయాల్లో సైతం ప్రభుత్వం ఈ జాబితాను అందుబాటులో ఉంచనుంది. ఎవరైనా అర్హులై ఉండి ప్రాథమిక జాబితాలో పేరు రాకపోతే వాళ్లు మరోసారి అమ్మఒడి స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జగన్ సర్కార్ ఈ నెల 30వ తేదీన అమ్మఒడి స్కీమ్ కు సంబంధించిన తుది జాబితాను విడుదల చేయనుంది.
విడుదల చేసిన ప్రాథమిక జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలను పరిశీలించి ప్రభుత్వం మార్పులుచేర్పులు చేయనుంది. జగన్ సర్కార్ లెక్కల ప్రకారం మొత్తం 83,72,254 మంది అమ్మఒడి స్కీమ్ ద్వారా ప్రయోజననం పొందనున్నారు. వీరిలో 72,74,674 మంది ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు కాగా 10,97,580 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు.
తుది జాబితాలో పేరు ఉన్నవారికి 2021 సంవత్సరం జనవరి 9వ తేదీన 15,000 రూపాయలు జమవుతుంది. విద్యార్థుల తల్లి ఖాతాలో ప్రభుత్వం ఈ నగదును జమ చేయనుంది. https://jaganannaammavodi.ap.gov.in/ , https://studentinfo.ap.gov.in/ వెబ్ సైట్ల ద్వారా అమ్మఒడి స్కీమ్ కు అర్హులో కాదో తెలుసుకోవచ్చు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…