Pushpa 2: పుష్ప 2 షూటింగ్ కి బ్రేక్..? ఆందోళనలో అభిమానులు..!

Pushpa 2: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ గా కనిపిస్తాడు. సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా నేషనల్ క్రష్ రష్మీక మందన్న నటించింది. తెలుగు, తమిళ్ , హిందీ, కన్నడ, మలయాళం భాషలలో విడుదలై ప్రేక్షకుల అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ముఖ్యంగా ఈ సినిమా నార్త్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అన్ని భాషలలో బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టిన అల్లు అర్జున్ ని పాన్ ఇండియా హీరోగా నిలబెట్టింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆటిట్యూడ్ బాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ప్రేక్షకులు పుష్ప 2 సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప పార్ట్ 1 మంచి హిట్ అవటంతో పార్ట్ 2 మరింత బాగుండాలని సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

తాజాగా అల్లు రామలింగయ్య పుట్టిన రోజు సందర్భంగా అల్లు స్టూడియోలో పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటివరకూ పుష్ప 2 సినిమా షూటింగ్ పట్టలెక్కలేదు .
తాజాగా పుష్ప 2 షూటింగ్ గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప 2 సినిమా షూటింగ్ కి బ్రేక్ పడినట్లు సోషల్ మీడియా వర్గాల నుండి సమాచారం . అయితే షూటింగ్ కి బ్రేక్ పడటానికి కారణం సుకుమార్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Pushpa 2: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్న సుకుమార్..

సుకుమార్ అనారోగ్యం కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు సమాచారం. సుకుమార్ గత కొన్ని రోజులుగా తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారని.. డాక్టర్ని సంప్రదిస్తే రెండు నెలలు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో మరో రెండు నెలల పాటు పుష్ప 2 సినిమా షూటింగ్ కి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.ఇలా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.