Movie News

Rishabh Shetty: కాంతారలోని కోలం అరుపులు దయచేసి బయట ఎవరూ చేయొద్దు.. ప్రేక్షకులను రిక్వెస్ట్ చేసిన రిషబ్ శెట్టి !

Rishabh Shetty:ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఏదైనా సినిమా చర్చలకు దారితీసింది అంటే అది కాంతార సినిమా అని చెప్పాలి.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ వివిధ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన కాంతారా సినిమాను కర్ణాటక తుళునాడులోని కోలా, కంబా సంప్రదాయ ఆచారాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు.

ఇక ఈ సినిమాలో ఒక వ్యక్తికి దేవుడు ఆవహించిన సమయంలో కోల ఆడే వ్యక్తులు ఓ.. అంటూ వింత శబ్దాన్ని చేస్తారని ఆ సినిమాలో చూపించారు. ఆ శబ్దం వచ్చినప్పుడు థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఈ క్రమంలోనే ఈ శబ్దంపై డైరెక్టర్ స్పందిస్తూ ప్రేక్షకులకు ఓ విన్నపం చేశారు. దయచేసి ఎవరూ కూడా ఆ శబ్దాన్ని ఇమిటేట్ చేయకండి అంటూ ఈయన ప్రేక్షకులను రిక్వెస్ట్ చేశారు.

అది కేవలం శబ్దం మాత్రమే కాదని.. అది తమకు ఓ సెంటిమెంట్ అని ఇది ఒక ఆచారం ఆధ్యాత్మిక నమ్మకం. ఇది చాలా సున్నితమైన అంశం ఇలా ప్రేక్షకులు బయట కూడా ఈ శబ్దాన్ని చేయటం వల్ల ఆచారం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి దయచేసి ఎవరూ కూడా ఈ శబ్దాన్ని చేయకండి అంటూ ఈ సందర్భంగా రిషబ్ శెట్టి అభిమానులకు చిన్న విన్నపం చేశారు.

Rishabh Shetty: నిజ సంఘటనల ఆధారంగా..

ఇక ఈ సినిమాని రిషబ్ శెట్టి తన నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.ఇక ఈ సినిమాలో ఒక మనిషిలోకి దేవుడు ఆవహించే సమయంలో ఎలా ఉంటారనే విషయాన్ని చాలా దగ్గరగా చూపించడంతో ప్రతి ఒక్కరి ఒళ్ళు జలదరించేలా డైరెక్టర్ ఈ సినిమాని ప్రేక్షకులకు చూపించారు.ఈ విధంగా అన్ని భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై ఎంతో మంది శనీ సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago