Babloo Prithiveeraj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బబ్లూ పృధ్విరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో తెలుగు సినిమాలలో నటుడిగా విలన్ గా ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పృథ్వి ఇండస్ట్రీకి దూరమై చాలా కాలం అయింది.
ఇలా ఇండస్ట్రీకి దూరంగా విదేశాలలో ఉన్నటువంటి ఈయన గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయన ఇదివరకే 1994లో బీనా అనే మహిళతో పెళ్లయింది. వీరికి ఓ బాబు కూడా పుట్టాడు. బాబుకు అహద్‌అనే పేరు పెట్టినట్లు తెలిపారు ప్రస్తుతం తన కుమారుడికి 27 సంవత్సరాలు ఉన్నాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈయన వెల్లడించారు. అయితే తన కుమారుడు అటిజం అనే వ్యాధితో బాధపడుతున్నారని తనకు మాట రాదంటూ ఈ సందర్భంగా పృథ్వి వెల్లడించారు.
ఇకపోతే 57 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఈనటుడు గత కొన్ని సంవత్సరాలుగా 23 సంవత్సరాలు వయసు ఉన్న మలేషియా యువతీనీ రెండవ వివాహం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా వీరిద్దరి వివాహం చాలా సీక్రెట్ గా జరిగిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఈ విధంగా పృథ్వి రెండవ వివాహం గురించి కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.త్వరలోనే పృథ్వి ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే 57 ఏళ్ల వయసులో ఈయన 23 ఏళ్ల యువతిని వివాహం చేసుకోవడంతో పెద్ద ఎత్తున నేటిజన్ లు ముసలి వయసులో కూతురు వయసు ఉన్న అమ్మాయితో రెండో పెళ్లి అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరి ఈ పెళ్లి విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…