Categories: FeaturedMovie News

Actress Pragathi: నేను అందగత్తెను.. తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకున్న ప్రగతి.. వైరల్ కామెంట్స్?

Actress Pragathi:టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరియర్ మొదట్లో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన ఈమె పెళ్లయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.ఇలా ఎన్నో సినిమాలలో యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటించి సందడి చేసిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈమె తన కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఇక తన కటౌట్ చూడటానికి చాలా పెద్దగా ఉన్నప్పటికీ తనని ఎవరైనా, ఏదైనా అంటే అసలు ఊరుకోనని అందరిలా కాకుండా వారికి తన స్టైల్ లో క్లాస్ పీకుతానని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.ఇక తనకు సినిమా అవకాశాలు వస్తే తాను కేవలం రజనీకాంత్ కమల్ హాసన్ వంటి వారితోనే సినిమాలు చేస్తానని చెప్పడం వల్ల ఎక్కువ సినిమాలు చేయలేకపోయానని ఈమె వెల్లడించారు.

ఇక ఇండస్ట్రీలో తల్లి పాత్రలలో నటించేటప్పుడు తనకు కాంప్లిమెంట్స్ కావాలని తాను ఎలాగున్నా అందగత్తెనేనంటూ ఈ సందర్భంగా ఈమె తన అందం గురించి తానే పొగుడుకుంటూ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ఇక తరచు తాను వర్కౌట్ చేయడం వల్ల తనకు అందం పెరగడం కాదు తనలో బలం, కాన్ఫిడెన్స్ పెరుగుతుందని ఈ సందర్భంగా ప్రగతి తెలియజేశారు.

Actress Pragathi: టాటూ సీక్రెట్ అదేనా..

ఇక ఇప్పటికి తాను క్యాట్ వాక్ చేస్తూ ఉంటానని అలాగే తన చేతి పై ఉన్నటువంటి టాటూ గురించి కూడా ఈ సందర్భంగా ఈమె తెలిపారు.కుడి చేతి పై మచ్చ ఉంది అయితే ఆ మచ్చ కనపడకుండా ఉండడం కోసమే తాను టాటూ వేయించుకున్నానని ఈ సందర్భంగా ప్రగతి ఎన్నో విషయాలను వెల్లడించారు.ఇక ప్రస్తుతం ప్రగతి వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago