Rishabh Shetty: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏ చిత్ర పరిశ్రమలో చూసిన కన్నడ నటుడు రిషబ్ శెట్టి పేరు మారుమోగిపోతుంది.కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి కాంతార అనే సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా అన్ని భాషలలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం ఈ హీరో గురించి పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈయన లవ్ స్టోరీ కి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.రిషబ్ శెట్టి ప్రగతి శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం ప్రేమ వివాహం అని వీరి ప్రేమలో ఎన్నో ట్విస్టులు దాగి ఉన్నాయని తెలుస్తోంది. నిజంగా వీరి లవ్ స్టోరీ వింటే అచ్చం ఒక సినిమాని తలపించేలా వీరి లవ్ స్టోరీ ఉంది.మరి రిషబ్ శెట్టి ప్రగతి శెట్టి ఎలా పరిచయమయ్యారు వీరి పెళ్లి ఎలా జరిగిందనే విషయానికి వస్తే..
రిషబ్ శెట్టి 2016 వ సంవత్సరంలో ఒక సినిమా ఈవెంట్లో భాగంగా ప్రగతి శెట్టిని చూశారు. ఇలా తొలిచూపులోనే ఆమెపై మనసు పారేసుకున్న రిషబ్ శెట్టి వెంటనే ఫేస్ బుక్ ఓపెన్ చేసి ప్రగతి శెట్టి కోసం వెతకడం ప్రారంభించారు. అయితే అప్పటికే ఆమె ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడంతో రిషబ్ ఏమాత్రం ఆలోచించకుండా తన ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఫేస్ బుక్ ద్వారా చాటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇలా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి అనంతరం ప్రేమగా మారింది.
ఈ క్రమంలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని వారి ప్రేమ విషయాన్ని ఇంట్లో వారికి తెలియజేశారు అయితే ప్రగతి కుటుంబ సభ్యులు రిషబ్ శెట్టితో తన వివాహం జరగడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. ఇలా రిషబ్ శెట్టితో పెళ్లికి ఒప్పుకోకపోవడానికి కేవలం ఆయన సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అన్న ఒక్క కారణంతోనే వీరి పెళ్లికి అంగీకరించలేదు. ఇలా ప్రగతి కుటుంబ సభ్యులు తమ పెళ్ళికి అంగీకరించకపోయిన ఆమె బలవంతంగా తన తల్లిదండ్రులను ఒప్పించి 2020వ సంవత్సరంలో ఎంతో ఘనంగా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…