Rashmi Gautam: గత రెండు రోజులుగా యాంకర్ రష్మీ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సింగర్ గీత మాధురి భర్త నందు రష్మీ ఫోన్ ఎత్తదు ప్రమోషన్లకు రాదు అంటూ పెద్ద ఎత్తున ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చివరికి ఆ వీడియోలో ఇది ఫ్రాంక్ అంటూ రశ్మిని ఇబ్బంది పెట్టిన విషయం మనకు తెలిసిందే.అయితే అసలు మ్యాటర్ ఏంటి అనే విషయానికి వస్తే నందు రష్మీ జంటగా గత రెండు సంవత్సరాల క్రితం బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా రెండు సంవత్సరాలు తర్వాత నవంబర్ 4వ తేదీ విడుదల కానుంది.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రష్మీకి ఫోన్లు చేసి సినిమా ప్రమోషన్లకు రావాలి అంటూ పిలవగా తాను ప్రమోషన్లకు రానని చెప్పి ఆపై ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉన్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నందు రష్మీ ఈ వీడియో పై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా యాంకర్ రష్మిని ప్రశ్నిస్తూ అది నిజంగానే ఫ్రాంక్ వీడియోనా అంటూ ప్రశ్న వేశారు.
ఈ ప్రశ్నకు రష్మీ సమాధానం చెబుతూ అది ఫ్రాంక్ వీడియో అయినప్పటికీ తాను చెప్పిన సమాధానం మాత్రం నిజమేనని తెలియజేశారు.రెండు సంవత్సరాల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాకి ఉన్నఫలంగా ప్రమోషన్లకు రావాలి అంటే నేను కూడా అందుకు సిద్ధంగా ఉండాలి నేను ఇప్పటికే ఎన్నో టీవీ షోలకు కమిట్ అయ్యి బిజీగా ఉన్నాను. ఇలా ఉన్నఫలంగా రావాలి అంటే కుదరదని చెప్పి ఫోన్ పెట్టేసాను అటు సమాధానం చెప్పారు.
అయినప్పటికీ తరచూ వీరు ఫోన్ చేస్తూనే ఉన్నారు.అందుకే తాను ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఇలా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏకంగా నేను షెడ్యూల్లో పాల్గొంటున్న సమయంలో అక్కడికే వచ్చారు అంటూ రష్మీ తెలిపారు. ప్రమోషన్లకు వెళ్లడానికి ఎందుకు ఇష్టం లేదు అంటూ యాంకర్ ప్రశ్నించగా.. అక్కడికి వెళ్తే వాళ్లు ఎన్నో ప్రశ్నలు అడుగుతారు ఆ సమాధానాలను తాను చెప్పలేననీ ఈ సందర్భంగా రష్మీ ఈ వీడియో గురించి క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…