Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి జన్మించినది మొగల్తూరు అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన జన్మించిన ఆ గ్రామంలో ఉన్న తన సొంత ఇంటిని చిరంజీవి మూడు లక్షలకు అమ్ముకున్నారు అంటూ ఆయన రాజకీయాలలోకి వచ్చిన సమయంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇలా చిరంజీవి కొన్ని కోట్లకు అధిపతి అయినప్పటికీ ఆ మూడు లక్షల రూపాయలు ఇంటిని ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది అనే విషయంపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి.
ఇలా మెగాస్టార్ చిరంజీవి గురించి ఇలాంటి వార్తలు వస్తున్నప్పటికీ చిరంజీవి మాత్రం ఈ వార్తలను ఖండించే ప్రయత్నం చేయలేదు.అయితే ఆ ఇంటిని ఎవరు అమ్ముకున్నారు అసలు ఏం జరిగింది అనే విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ప్రభు క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ…
అందరూ అనుకున్న విధంగా మొగల్తూరులో మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటిని అమ్ముకున్నారనే వార్తలలో ఏ మాత్రం నిజం లేదు. నిజం చెప్పాలంటే మొగల్తూరులో చిరంజీవి గారికి ఎలాంటి ఇల్లు లేదు. చిరంజీవి గారు కేవలం మొగల్తూరులో జన్మించినప్పటికీ తన తండ్రి ఉద్యోగ నిమిత్తం పలు ప్రాంతాలను తిరగటం వల్ల వారికంటూ సొంత ఇల్లు లేదు.ఈ క్రమంలోనే చిరంజీవి తండ్రి ఉద్యోగ నిమిత్తం మొగల్తూరులో కూడా పనిచేసినప్పటికీ ఆ గ్రామంలో ఎలాంటి సొంత ఇంటిని కొనుగోలు చేయలేదు.
ఈయన రాజకీయాలలోకి వచ్చినప్పుడు కేవలం కొందరు ఉద్దేశపూర్వకంగానే అతనిపై ఇలాంటి బురదజల్లే ప్రయత్నం చేశారు.మొగల్తూరులో చిరంజీవి తాతగారు ఇంటిని 3 లక్షల రూపాయలు అమ్ముకున్నారు అయితే ఆ ఇంటికి చిరంజీవి గారికి ఏమాత్రం సంబంధం లేదు. ఇక 1998 నాటికే చిరంజీవి గారి పేరు పై మొగల్తూరులో ఒక లైబ్రరీ ఉంది బహుశా ఈ విషయం చాలామందికి తెలిసి ఉండదు.ఇక ఈ ఇంటి విషయం గురించి ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ చిరంజీవి మాత్రం ఎప్పుడూ కూడా ఇలా తన గురించి వచ్చే తప్పుడు వార్తలను ఖండించే ప్రయత్నం చెయ్యరు అందుకే ఈ వార్తలు ఎక్కువ కాలం పాటు ప్రచారంలో ఉన్నాయంటూ ఈ సందర్భంగా జర్నలిస్టు ప్రభు మెగాస్టార్ చిరంజీవి ఇంటి గురించి క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…