Connect with us

Featured

Rashmi Gautam: ఫ్రాంక్ వీడియోపై స్పందించిన రష్మీ.. ప్రమోషన్ లో పాల్గొనడం ఇష్టం లేదంటూ కామెంట్స్?

Published

on

Rashmi Gautam: గత రెండు రోజులుగా యాంకర్ రష్మీ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సింగర్ గీత మాధురి భర్త నందు రష్మీ ఫోన్ ఎత్తదు ప్రమోషన్లకు రాదు అంటూ పెద్ద ఎత్తున ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చివరికి ఆ వీడియోలో ఇది ఫ్రాంక్ అంటూ రశ్మిని ఇబ్బంది పెట్టిన విషయం మనకు తెలిసిందే.అయితే అసలు మ్యాటర్ ఏంటి అనే విషయానికి వస్తే నందు రష్మీ జంటగా గత రెండు సంవత్సరాల క్రితం బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా రెండు సంవత్సరాలు తర్వాత నవంబర్ 4వ తేదీ విడుదల కానుంది.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రష్మీకి ఫోన్లు చేసి సినిమా ప్రమోషన్లకు రావాలి అంటూ పిలవగా తాను ప్రమోషన్లకు రానని చెప్పి ఆపై ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉన్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నందు రష్మీ ఈ వీడియో పై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా యాంకర్ రష్మిని ప్రశ్నిస్తూ అది నిజంగానే ఫ్రాంక్ వీడియోనా అంటూ ప్రశ్న వేశారు.

Advertisement

ఈ ప్రశ్నకు రష్మీ సమాధానం చెబుతూ అది ఫ్రాంక్ వీడియో అయినప్పటికీ తాను చెప్పిన సమాధానం మాత్రం నిజమేనని తెలియజేశారు.రెండు సంవత్సరాల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాకి ఉన్నఫలంగా ప్రమోషన్లకు రావాలి అంటే నేను కూడా అందుకు సిద్ధంగా ఉండాలి నేను ఇప్పటికే ఎన్నో టీవీ షోలకు కమిట్ అయ్యి బిజీగా ఉన్నాను. ఇలా ఉన్నఫలంగా రావాలి అంటే కుదరదని చెప్పి ఫోన్ పెట్టేసాను అటు సమాధానం చెప్పారు.

Anchor Rashmi: సుధీర్ తోనే కాదు వారందరితో కూడా నాకు ఎఫైర్ ఉందన్నారు… షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రష్మీ!

Rashmi Gautam: టీవీ షోలతో బిజీ..

అయినప్పటికీ తరచూ వీరు ఫోన్ చేస్తూనే ఉన్నారు.అందుకే తాను ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఇలా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏకంగా నేను షెడ్యూల్లో పాల్గొంటున్న సమయంలో అక్కడికే వచ్చారు అంటూ రష్మీ తెలిపారు. ప్రమోషన్లకు వెళ్లడానికి ఎందుకు ఇష్టం లేదు అంటూ యాంకర్ ప్రశ్నించగా.. అక్కడికి వెళ్తే వాళ్లు ఎన్నో ప్రశ్నలు అడుగుతారు ఆ సమాధానాలను తాను చెప్పలేననీ ఈ సందర్భంగా రష్మీ ఈ వీడియో గురించి క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Featured

Sitara: ఆ పని చేస్తే నాన్నకు బాగా కోపం వస్తుంది… మహేష్ సీక్రెట్ బయటపెట్టిన సితార!

Published

on

Sitara: సితార ఘట్టమనేని పరిచయం అవసరం తెలిపారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు వారసురాలిగా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి సితార ఇంత చిన్న వయసులోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

సితార ఒకవైపు చదువులలో ముందుకు కొనసాగుతూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈమె ఇప్పటికే ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ముఖ్యంగా ఎన్నో డాన్స్ వీడియోలను చేస్తూ ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

ఇక సితార ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఇంత చిన్న వయసులోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సితార తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Advertisement

జుట్టు తాకితే నచ్చదు…
ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి అని ప్రశ్నించగా నా పేరెంట్స్ అంటూ సమాధానం చెప్పారు. ఇంట్లో ఏవైనా కండిషన్స్ ఉన్నాయా అంటే అలాంటి కండిషన్స్ తనకి ఏమీ లేదని తెలిపారు. ఇక తన తండ్రి సీక్రెట్ గురించి కూడా సితార బయటపెట్టారు. నాన్నకు జుట్టు అంటే చాలా ఇష్టం ఎవరైనా తన చుట్టూ టచ్ చేస్తే తనకు అసలు నచ్చదని ఈ సందర్భంగా సితార చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Jhanvi Kapoor: శుక్రవారం ఆ పని అస్సలు చేయను.. జాన్వీకి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా?

Published

on

Jhanvi Kapoor: సినీ ఇండస్ట్రీలో శ్రీదేవి వారసురాలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి జాన్వీ కపూర్. ఒకప్పుడు ఈమె బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఉండేవారు అయితే ప్రస్తుతం తెలుగులో కూడా సినిమా అవకాశాలను అందుకుంటూ వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా నటిగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె ఎక్కువగా గుళ్లు గోపురాలు అంటూ ఆలయాలను సందర్శించడమే కాకుండా మన హిందూ సాంప్రదాయాలను కూడా ఎంతో చక్కగా పాటిస్తారు అనే విషయాలు మనకు తెలిసినదే.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జాన్వీ ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించారు. తన తల్లి శ్రీదేవి ఎన్నో మతపరమైనటువంటి ఆచార వ్యవహారాలను పాటించేవారు.

అమ్మ ఉన్నప్పుడు తాము ఇలాంటి పద్ధతులను అసలు పాటించే వాళ్ళం కాదని తెలిపారు. కానీ అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ పాటించే కొన్ని కట్టుబాట్లను తాను కూడా పాటిస్తున్నానని తెలిపారు. అమ్మ ఉన్నప్పుడు శుక్రవారం ఎట్టి పరిస్థితులలో కూడా జుట్టు కత్తిరించేది కాదు అలా చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదని చెప్పేవారు. అప్పుడు మేము ఈ మాటలను కొట్టి పారేసే వాళ్ళం కానీ ఇప్పుడు తాను శుక్రవారం జుట్టు కట్ చేయనని తెలిపారు.

Advertisement

తిరుమల శ్రీవారు..
ఇకపోతే శుక్రవారం ఎప్పుడూ కూడా నలుపు రంగు దుస్తులను ధరించకూడదని అమ్మ చెప్పేది తాను ఇప్పటికీ కూడా ఈ విషయాన్ని ఫాలో అవుతూ ఉన్నానని జాన్వీ తెలిపారు. ఇక అమ్మ ఎప్పుడు తిరుమల శ్రీవారిని నారాయణ నారాయణ నారాయణ అంటూ తలుచుకుంటూ ఉండేది. ప్రతి ఏడాది తన పుట్టినరోజు అమ్మ తిరుపతి వెళ్ళేది అమ్మ చనిపోయిన తర్వాత తన పుట్టినరోజు నాడు మేము వెళ్లాలని నిర్ణయించుకున్నాము అంటూ ఈ సందర్భంగా జాన్వీ కపూర్ చేస్తున్న ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: ఎన్నికల తర్వాత సైలెంట్ అయిన జనసేనాని…ఎక్కడున్నారు..ఎందుకీ మౌనం?

Published

on

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాలా మౌనంగా ఉన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహించినటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఈయన మోడీ నామినేషన్ కార్యక్రమంలో భాగంగా వారణాసిలో తన భార్యతో కలిసి కనిపించారు.

ఇలా పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజీనోవాతో కలిసి పలు ఆలయాలను సందర్శించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం ఈయన సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు..ఏం చేస్తున్నారనే విషయాలు మాత్రం తెలియడం లేదు.

ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారు. ఎంతో ఎండలో కూడా ఈయన ప్రచార కార్యక్రమాలను నిర్వహించడంతో అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం ఈయన ఎలాంటి వెకేషన్ కి వెళ్లకుండా కేవలం ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం.

Advertisement

గెలుపు పై ధీమా లేదు…
ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున అధికార ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత గెలుపు కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు తామే గెలుస్తామని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా సైలెంట్ అయ్యారు. ఇలా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఎందుకు ఈయన మౌనంగా ఉన్నారనే విషయాలు అందరికీ సందేహాలను కలిగిస్తున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!