పొత్తిళ్లలో పసిపాప ఉండగా రాధికకు కథ వినిపించిన డైరెక్టర్ ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎప్పుడు ఎవరిని ఎలా వెతుక్కుంటూ వస్తాయో ఎవరికీ తెలియదు. స్టార్ సెలబ్రిటీలగా కొనసాగుతున్న వారికి అవకాశాలు వారు ఎక్కడున్నా కూడా వారి వెనకే వస్తుంటాయి. ఈ క్రమంలోనే 1990 లలో తెలుగు తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో నటి రాధిక ఒకరు. అప్పట్లో ఈమెకు ఒక రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.

ఈ క్రమంలోనే రాధిక ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది.1992 ఆగస్టు నెలలో అప్పుడే రాధికా ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మొదటిసారిగా ఓ బిడ్డకు జన్మనివ్వడంతో రాధిక మాతృత్వ ఆనందాన్ని పొందుతుంది. ఈ క్రమంలోనే అప్పటికే రాధిక స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందడంతో ఆమెను కలవడానికి ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ క్రమంలోనే దర్శకుడు భారతీయ రాజ కూడా రాధిక దగ్గరకు వెళ్తూ తనతో పాటు ఒక స్క్రిప్ట్ ను కూడా తీసుకు వెళ్లారు.అయితే రాధిక దగ్గరకు వెళ్లిన అతను రాధికకు స్క్రిప్ట్ వినిపించగా అందుకు రాధిక ఆశ్చర్యపోతూ నీకేమైనా పిచ్చి పట్టిందా.. నేను ఇప్పుడే ఓ బిడ్డకు జన్మనిచ్చాను అప్పుడే నటించమని అడుగుతున్నారు అంటూ.. అందులో నటించడానికి రాధిక నో చెప్పారు.అయితే వీరిద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉండటం చేతనే తనతో రాధిక ఆ విధంగా మాట్లాడారు.

అందుకు దర్శకుడు భారతీయ రాజ లేదు మీరు ఇందులో తప్పకుండా నటించాలి మీకోసమే ఇది సిద్ధం చేశానని బలవంతం చేశారు. ఈ క్రమంలోనే రెండు నెలల తన బిడ్డకు పాలు తాపిస్తూ ‘కిళక్కు చీమయిలే’ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని వాదలకుండులో జరిగింది. రాధిక ఒంటరిగా పాపను తీసుకొని సినిమా షూటింగ్ కోసం ప్రయాణాలు చేయటం వల్ల అప్పటి వరకు ఆమెలో లేని ఓర్పు, సహనం బాగా పెరిగిపోయాయి.తన జీవితంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆ సమయం ఎంతో ఉపయోగపడిందని రాధిక ఓ సందర్భంలో తెలియజేశారు.