Featured

పాపం కమలిని ముఖర్జీకి ఆ దర్శకుడు ఎంత చేసినా అవకాశాలు రాకపోవడానికి కారణాలివే..!?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ జీవితం పడి లేచే కెరటం లాంటిది. ఎప్పుడు స్టార్ డం వస్తుందో ఎప్పుడు రోడ్డున పడతారో ఎవరూ చెప్పలేరు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడమే ఓ గొప్ప విషయం. వచ్చిన తర్వాత క్రేజ్ కోసం ఎన్నో చేయాల్సి వస్తుంది. మనసు నచ్చకపోయినా కొన్ని సందర్భాలలో కథ డిమాండ్ చేసింది..ఆడియన్స్ ఇలానే ఇష్టపడతారు.. వాళ్ళలో మీకు పాపులారిటీ పెరిగి ఫ్యాన్ ఫాలోయింగ్ రావాలంటే తప్పదు అని అభ్యంతరకరమైన సన్నివేశాలను చేయమని సలహాలిచ్చే దర్శకులున్నారు.

వారు చెప్పేది నిజమో అబద్దమో అని ఆలోచించుకునే సమయం కూడా దొరకని సందర్భాలలో చెప్పింది చేయడం తప్ప మరో ఆలోచన ఉండదు. చీర కట్టుకున్న సన్నివేశాలలోనూ నాభి చూపించమంటే ఇబ్బంది పడే హీరోయిన్ ఇప్పటికీ లేకపోలేదు. 100 మంది ముందు అలా ఒళ్ళు చూపిస్తూ నటించాలంటే మనసులో అన్నీ ఆలోచనలు తీసేయాలి. అలా అయితే పూజా హెగ్డే, రష్మిక మందన్నల మాదిరిగా స్టార్ స్టేటస్ దక్కించుకోగలుగుతారు. లేదంటే రెండవ సినిమా అవకాశం ఉండదు. ఇక్కడికొచ్చే ముందు ఇది రంగుల ప్రపంచం అని అన్నిటికీ సిద్దపడి రావాలి.

అవకాశాలు వచ్చినా రాకపోయినా మనకంటూ ఇంకో వ్యాపకం, టాలెంట్ ఉందని భరోసాగా వస్తేనే అవకాశాలు దక్కకపోయినా కూడా పట్టించుకోకుండా మరో పని వెతుక్కుంటారు. లేదంటే ఎదురు చూపులు తప్ప మిగిలేదేమీ ఉండదు. ప్రస్తుతం కమలిని ముఖర్జీ పరిస్థితి కూడా ఇలా ఎదురు చూపులతోనే ఉందని టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీలోకి తీసుకు రావడం తో పాటు శేఖర్ కమ్ముల ..కమలిని ముఖర్జీకీ చాలా సపోర్ట్ చేశాడు. ఆనంద్ తీసినప్పుడు కొత్తమ్మాయి కావాలని వెతికి మరీ ఈమెని ఎంచుకున్నాడు. ఆయన కథకి అందులోని పాత్రకి కమలిని ముఖర్జీ పూర్తి న్యాయం చేసింది.

అయితే ఇది గ్లామర్ రోల్ కాదు. కాబట్టి పెద్ద హీరోల సినిమాలలో అవకాశాలు రాలేదు. ఇక కమలిని ముఖర్జీ రెండవ సినిమా మీనాక్షి. ఇది వచ్చినట్టు కూడా ఎవరికీ తెలీదు. అందుకు కారణం దర్శకుడు కొత్తవాడు. హీరో రాజీవ్ కనకాల. ఇది ఆమె కెరీర్ కి చాలా మైనస్ అయింది. ఆ తర్వాత కూడా శేఖర్ కమ్ములనే అవకాశం ఇచ్చాడు. గోదావరి సినిమాలో సుమంత్ సరసన నటించే అవకాశం అందుకున్న కమలిని ముఖర్జీ.. చక్కటి పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఈ సినిమాలోని అందంగా లేనా.. అస్సలేం బాలేనా అనే ఇప్పటికీ వినిపిస్తుంది.    

కానీ ఈమె అందం టాలీవుడ్ కి సరిపోలేదు. అందుకే స్టార్ హీరోలతో నటించే అవకాశం అందుకోలేక విఫలమైంది. జల్సా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నా కూడా అసలు క్రెడిట్ అనేది కమలిని ముఖర్జీకి దక్కలేదు. ఈమెని గ్లామర్ రోల్స్ లో చూపించేందుకు ఏ దర్శకుడు దృష్ఠి పెట్టలేదు. ఒక్క సినిమా గనక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పడి ఉంటే రమ్యకృష్ణ మాదిరిగా ఇప్పుడు కెరీర్ మరో రేంజ్ ఉండేదేమో. కానీ ప్రస్తుతం ఈమె అవకాశాలు లేక ఎలాంటి రోల్ వచ్చినా చేసేందుకు రెడీగా ఉంది. మరి మనవాళ్ళు అవకాశం ఇస్తారో..ముంబై నుంచి కొత్త సరుకుని తెచ్చుకుంటారో.  

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago