General News

మద్యం ప్రియులకు శుభవార్త.. తెలంగాణలో పెరగనున్న మద్యం షాపులు.. ఎన్నో తెలుసా.!

తెలంగాణ ప్రభుత్వం మద్యం ప్రియులకు శుభవార్త అందించింది. ఉన్న మద్యం షాపులకు అదనంగా మరో 200 మద్యం దుఖాణాలకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలో 2216 మద్యం దుకాణాలకు లైసెన్సులు ముగుస్తున్న నేపథ్యంలో వాటిని వేలం నిర్వహించాల్సి ఉంటుంది. అదనంగా ఆదాయాన్ని పెంచుకునే క్రమంలోనే మద్యం దుఖానాల సంఖ్యను పెంచుతున్నట్లు తెలుస్తోంది.

మరో 200 మద్యం దుకాణాలకు లెసెన్సులు ఇవ్వనున్నట్లు సమాచారం. కొత్తగా ప్రభుత్వం మరో 80 బార్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. పలు కారణాలతో ప్రారంభం కాలేదు. గత ఏడు సంవత్సరాల నుంచి తెలంగాణలో ఒక్క మద్యం దుకాణానికి అనుమతి ఇవ్వలేదు. కొత్త మండలాలు, మున్సిపాలిటీల ప్రకారం మద్యం దుకాణాలు తెరవాలని అధికారులు ప్రతిపాదించారు. అదనంగా మరో రూ. 1200 కోట్ల ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఐదు సంవత్సరాల క్రితం వేలంలో అప్లికేషన్ ఫీజు రూ.50 వేలుగా ఉండేది. ఆ తర్వాతి రెండేళ్లకు జరిగిన వేలంలో ఆ ఫీజును రూ.లక్ష చేశారు. మళ్లీ రెండేళ్ల తర్వాత ఇప్పుడు దాన్ని రూ.3లక్షలు చెయ్యాలనే ప్రతిపాదన ఉంది అని తెలిసింది. ప్రస్తుతం అబ్కారీ శాఖ నుంచి సంవత్సరానికి రూ.9 వేలకోట్ల ఆదాయం వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం లిక్కర్ ఫీజు కూడా పెంచబోతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ ఫీజు రూ.45 లక్షలు, రూ.50 లక్షలు, రూ.80 లక్షలు, రూ.1.20 కోట్లతో నాలగు స్లాబులతో ఉంది. దానిని 5 శాతం నుంచి మరో 8 శాతం వరకు పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఎక్కడైతే వేడుకలు, పండుగలు, ఫంక్షన్లు వంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో.. అలాంటి వాటి చోట కొత్తగా మద్యం దుకాణాలను తెరవాలని కొందరు కోరుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago