Railway Track: వామ్మో …. ఇదేం దొంగతనం రా బాబు.. రైల్వే ట్రాక్ ను మాయం చేసి స్క్రాప్ కింద దొంగలు.. ఎక్కడంటే?

Railway Track: సాధారణంగా దొంగలు బ్యాంకులకు ఖన్నం వేయడం లేదా ఇళ్లల్లో చోరీ చేయడం వంటివి జరగడం మనం వినే ఉన్నాం. అయితే మీరు ఎప్పుడైనా రైల్వే ట్రాక్ లను దొంగతనం చేయడం విన్నారా వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం ఓ దొంగలు ముఠా ఏకంగా రైల్వే ట్రాక్ పై కన్ను వేసి రైల్వే ట్రాక్ ను మాయం చేయడమే కాకుండా స్క్రాప్ కింద అమ్మేసిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.

రైల్వే సిబ్బంది చేతి వాటం ప్రదర్శించడంతో ఇదే అధునుగా భావించిన దొంగల ముఠా అక్కడ రైల్వే ట్రాక్ ఉందని ఆనవాళ్లు కూడా లేకుండా రైల్వే ట్రాక్ దొంగలించి స్క్రాప్ కింద అమ్మేసి సొమ్ము చేసుకున్న ఘటన బీహార్ లోని మధుబని జిల్లాలోని బెలాహీలో చోటు చేసుకుంది. అయితే తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

మధుబని జిల్లాలోని బెలాహీలో లోహత్ షుగర్ మిల్ ఉంది. ఈ ఫ్యాక్టరీకి రవాణా సదుపాయం కోసం అప్పట్లోనే రైల్వే శాఖ ఓ ట్రాక్ ను వేసింది.అయితే ఈ మిల్ మూతపడటంతో గత రెండు దశాబ్దాలుగా ఈ రైల్వే ట్రాక్ పై రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. అయితే ఇలా ఆగిపోయిన రైల్వే ట్రాక్లను అధికారులు స్క్రాప్ కింద అమ్మేయడం జరుగుతుంది కానీ అధికారులు ఈ రైల్వే ట్రాక్ గురించి పట్టించుకోకపోవడంతో కొందరు దొంగల ముఠా రైల్వే అధికారుల సహాయంతో ఈ రైల్వే ట్రాక్ దొంగలించి స్క్రాప్ కింద అమ్మేశారు.

Railway Track: ఇద్దరు రైల్వే అధికారులపై వేటు వేసిన ఉన్నతాధికారులు…


అసలు ఈ ప్రాంతంలో ఒక రైల్వే ట్రాక్ ఉంది అనే ఆడవాళ్లు కూడా కనిపించని విధంగా ఈ రైల్వే ట్రాక్ ను మోసం చేశారు. అయితే ఆ దొంగలు ఆర్ పీఎఫ్ సిబ్బందితోకలిసి ఈ దారుణానికి పాల్పడటంతో ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు ఇద్దరు సిబ్బందిపై వేటు వేశారు అయితే పూర్తి విచారణ చేసిన తర్వాత ఈ విషయంపై సరైన నిర్ణయం తీసుకుంటామని రైల్వే శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.