Akshay Kumar: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే కొన్నిసార్లు సెలబ్రిటీలు తెలిసి తెలియక చేసిన పొరపాట్లు వల్ల భారీగా నేటిజన్ల నుంచి ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.అయితే కొన్ని సందర్భాలలో వారు తెలిసి తెలియక చేసిన తప్పు వల్ల కూడా క్షమాపణలు చెప్పే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి నటుడు అక్షయ్ కుమార్ కు ఎదురవుతుందని చెప్పాలి.
సాధారణంగా సెలబ్రిటీలు సినిమాలతో పాటు కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్ సైతం నార్త్ అమెరికా టూర్ ప్రమోషన్లో పాల్గొన్నారు .ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా నటుడు అక్షయ్ కుమార్ తో పాటు ఇతర సెలబ్రిటీలు కూడా గ్లోబు మీద నడుస్తూ ఉన్నట్లు ఈ వీడియోలో ఉంది.
ఇక ఈ వీడియోని అక్షయ్ కుమార్ షేర్ చేస్తూ…నార్త్ అమెరికాలోని ప్రేక్షకులకు 100 శాతం వినోదం అందించేందుకు ది ఎంటర్ టైనర్స్ సిద్ధంగా ఉంది. మార్చిలో మేము వస్తున్నాం. సీట్ బెల్టులు పెట్టుకుని సిద్ధంగా ఉండండి’ అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఇందులో అక్షయ్ కుమార్ చెప్పులు ధరించి గ్లోబుపై ఇండియా మ్యాప్ మీద అడుగు పెట్టడంతో చాలామంది ఈయన వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే పలువురు నెటిజెన్లు స్పందిస్తూ కాస్త భారతదేశాన్ని గౌరవించండి అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం ఇలా చేయటానికి సిగ్గుగా అనిపించలేదా అంటూ ఫైర్ అవుతున్నారు.మీరు ఇలా చేయడం భారతదేశాన్ని అవమానించడమేనని కొందరు మండిపడుతూ అక్షయ్ చేసిన పనికి 150 కోట్ల మంది భారతీయులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వీడియో పై అక్షయ్ కుమార్ ఏ విధంగా స్పందిస్తారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…