Akshay Kumar: సిగ్గుగా అనిపించలేదా… నటుడు అక్షయ్ కుమార్ పై ఫైర్ అవుతున్న నేటిజన్స్!

0
119

Akshay Kumar: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే కొన్నిసార్లు సెలబ్రిటీలు తెలిసి తెలియక చేసిన పొరపాట్లు వల్ల భారీగా నేటిజన్ల నుంచి ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.అయితే కొన్ని సందర్భాలలో వారు తెలిసి తెలియక చేసిన తప్పు వల్ల కూడా క్షమాపణలు చెప్పే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి నటుడు అక్షయ్ కుమార్ కు ఎదురవుతుందని చెప్పాలి.

సాధారణంగా సెలబ్రిటీలు సినిమాలతో పాటు కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్ సైతం నార్త్ అమెరికా టూర్ ప్రమోషన్లో పాల్గొన్నారు .ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా నటుడు అక్షయ్ కుమార్ తో పాటు ఇతర సెలబ్రిటీలు కూడా గ్లోబు మీద నడుస్తూ ఉన్నట్లు ఈ వీడియోలో ఉంది.

ఇక ఈ వీడియోని అక్షయ్ కుమార్ షేర్ చేస్తూ…నార్త్ అమెరికాలోని ప్రేక్షకులకు 100 శాతం వినోదం అందించేందుకు ది ఎంటర్ టైనర్స్ సిద్ధంగా ఉంది. మార్చిలో మేము వస్తున్నాం. సీట్ బెల్టులు పెట్టుకుని సిద్ధంగా ఉండండి’ అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఇందులో అక్షయ్ కుమార్ చెప్పులు ధరించి గ్లోబుపై ఇండియా మ్యాప్ మీద అడుగు పెట్టడంతో చాలామంది ఈయన వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.

Akshay Kumar: భారతీయులకు క్షమాపణలు చెప్పాలి…


ఈ క్రమంలోనే పలువురు నెటిజెన్లు స్పందిస్తూ కాస్త భారతదేశాన్ని గౌరవించండి అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం ఇలా చేయటానికి సిగ్గుగా అనిపించలేదా అంటూ ఫైర్ అవుతున్నారు.మీరు ఇలా చేయడం భారతదేశాన్ని అవమానించడమేనని కొందరు మండిపడుతూ అక్షయ్ చేసిన పనికి 150 కోట్ల మంది భారతీయులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వీడియో పై అక్షయ్ కుమార్ ఏ విధంగా స్పందిస్తారు.