Rajinikanth: వెంకయ్య నాయుడుకి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వటం కరెక్ట్ కాదు … రజనీ కాంత్ కామెంట్స్ వైరల్!

RajiniKant : కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన రజనీ కాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయనకి కేవలం కోలీవుడ్ లో మాత్రమే కాకుండా ఇటు టాలివుడ్, అటు బాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వయసు పెరగడంతో అనారోగ్య కారణాలవల్ల రజనీకాంత్ సినిమాలను కొంతవరకు తగ్గించాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురించి రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇటీవల జరిగిన సెపియన్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవ వేడుకలలో రజనీకాంత్, వెంకయ్య నాయుడు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. సెపియన్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవ వేడుకలలో పాల్గొన్న రజినీకాంత్ మాట్లాడుతూ..” వెంకయ్య నాయుడు గారికి ఉపరాష్ట్రపతి పదవీ పటం తనకు నచ్చలేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాలలో రాణిస్తూన్న ఒక గొప్ప నాయకుడికి ఉపరాష్ట్ర పదవి ఇవ్వటం కరెక్ట్ కాదని రజనీకాంత్ తెలిపారు.

వెంకయ్య నాయుడు గారిని రాజకీయాలకు దూరం చేయాలనే ఆలోచనతోనే ఇలా ఉపరాష్ట్ర పదవి ఇచ్చారని రజనీకాంత్ వెల్లడించాడు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న వారికి ఎటువంటి అధికారాలు ఉండవు. మరికొంత కాలం ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగి ఉంటే బాగుండేదని” రజనీకాంత్ తన మనసులో మాట బయటపెట్టాడు. అయితే ఇలా వెంకయ్య నాయుడు గురించి చేసిన వ్యాఖ్యలు కేంద్ర రాజకీయ వర్గాలలో చర్చంశనీయంగా మారాయి.

RajiniKant : ఆయన ఆరోగ్యంగా ఉండాలి….

ఇదిలా ఉండగా ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు మాట్లాడుతూ… ” రజనీకాంత్ ఆరోగ్యంగా ఉండాలంటే రాజకీయాలలోకి రాకూడదు. అయితే ఆయన్ని రాజకీయాలలోకి రావద్దని చెప్పాను. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలే కాకుండా ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. అయితే రాజకీయాలలోకి రావాలనుకుంటున్న వారిని నేను నిరుత్సాహపరచడం లేదు. క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధత, అంకితభావం, భావజాల నిబద్ధత ఉన్న యువత రాజకీయాలలోకి రావాలని” ఆయన సూచించారు.