Sreemukhi: మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నాడు. ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్న చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రముఖ బుల్లితెర యాంకర్ శ్రీముఖి కూడా నటిస్తోంది. టీవీ షోలలో యాంకర్ గా సందడి చేస్తున్న శ్రీముఖి చిరంజీవి ఈ అవకాశాన్ని కల్పించాడు. ఈ సినిమాలో శ్రీముఖి చిరంజీవితో కలిసి రొమాన్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ భూమిక మధ్య ఉన్న నడుము సీన్ ని భోళా శంకర్ సినిమాలో చిరంజీవి శ్రీముఖి మద్య ఇటీవల షూట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇలా బోలా శంకర్ సినిమాలో శ్రీముఖి చిరంజీవితో రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది. చాలా కాలంగా యాంకర్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్న శ్రీముఖి అప్పుడప్పుడు సినిమాలలో కూడా నటిస్తోంది . అయితే ఈమె నటించిన పాత్రలకు సరైన గుర్తింపు మాత్రం లభించడం లేదు. దీంతో అమ్మడికి సినిమాలలో అవకాశాలు రావడం లేదు. సినిమాలలో సక్సెస్ సాధించడం కోసం ఎదురుచూస్తున్న శ్రీముఖికి చిరంజీవితో చేసిన రొమాన్స్ హెల్ప్ అవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
శ్రీముఖి చిరంజీవి సినిమా పైనే భారీగా ఆశలు పెట్టుకుంది. ఇదివరకు ఎన్నోసార్లు వెండి తర్వాత అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈమెకు ఈసారైనా అదృష్టం కలిసి వస్తుందో లేక ఇలాగే బుల్లితెరపై యాంకర్ గా స్థిరపడతారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీముఖి బుల్లితెరపై ప్రతి ఒక్క ఛానల్ లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా సందడి చేస్తూ వస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…