Ram Gopal Varma : అమల, నాగార్జున లేచి వెళ్ళేటపుడు.. బాడీగార్డ్స్ కనిపిస్తారు.. మంచి ఛాన్స్ మిస్ అని సురేష్ కృష్ణ అన్నాడు..: ఆర్జీవి

Ram Gopal Varma : తెలుగు సినిమాకు కొత్త ట్రెండ్ ను తెచ్చిన ట్రెండ్ సెట్టర్ వర్మ. ‘శివ’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ సినిమా తీరును మార్చేశాడు. స్టడీ కెమెరాను వాడి సినిమా విజువల్స్ కి కొత్తదనం తీసుకోచ్చి అలానే సినిమా పంథాను మార్చి అందరినీ ఆకర్శించాడు వర్మ. వివాదాలతో బతికే వర్మలో ఒక మంచి టెక్నీషియన్ ఉన్నాడు, ఇది ఎవరూ కాదనలేని సత్యం. తాను తీసిన పాత సినిమాలను చూస్తే ఎవరైనా ఆర్జీవి ఫ్యాన్ అవ్వాల్సిందే. అయితే ఇదంతా ఒకప్పుడు, ఇప్పుడు ఉన్న వర్మ వేరు. అయితే తాజాగా శివ సినిమా గురించి విశేషాలను వర్మ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

సినిమా బాగోలేదని అందరూ చెప్పారు…

శివ సినిమా ఆర్జీవి కెరీర్ లోనే ఒక గొప్ప సినిమా. ఆర్జీవి టాలెంట్ ఏంటో తెలియాలంటే శివ సినిమా ఒక్కటి చాలు అతను ఎంత గ్రేట్ టెక్నీషియనో తెలుస్తుంది. అయితే సినిమా తీసినపుడు మొదటి సారి చూసిన వారందరూ సినిమా బాగోలేదని చెప్పడం విశేషం కానీ అదే సినిమా మెల్లగా జనాలకు ఎక్కి టాలీవుడ్ లోనే ట్రెండ్ సెట్టర్ మూవీ గా మారింది. శివ సినిమా గురించి మాట్లాడుతూ అందులో అమల, నాగార్జున కాంటీన్ లో కూర్చొని ఉన్న సీన్ లో పక్కనే బాడీ గార్డ్స్ కూడా ఉంటారు. మామూలుగా సినిమాల్లో పక్కన ఏం జరుగుతోందో కూడా చూపిస్తూ ప్రేక్షకుడు కన్ఫ్యూస్ అవ్వకుండా చూస్తారు కానీ నేను అలా కాకుండా అమల, నాగార్జున లేచాక వెనక ఉన్న బాడీ గార్డ్స్ ను చూపించడంతో ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యారు.

అది చాలా సింపుల్ లాజిక్ అయినా ఎవరూ అంతవరకు వాడకపోవడం వల్ల కొత్తగా అనిపించింది అందరికీ అంటూ తెలిపారు వర్మ. ఇక సినిమా పూర్తి అయ్యాక చూసిన చాలా మంది దర్శకులు సినిమా పర్వాలేదానే చెప్పారు, ఎవరూ బాగుందని చెప్పలేదు. ఇక డైరెక్టర్ సురేష్ సాయి కృష్ణ అయితే నీకు మొదటి సారే అయినా వచ్చిన గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకున్నావ్ ఏంటి అని ఫోన్ చేసి అన్నపుడు అదేంటి సినిమా బాగోలేదా అని ఆలోచించా. అయినా ఇక చేసేదేమి లేదు అనుకున్నా అంటూ ఆర్జివి శివ సినిమా గురించి తెలిపారు.