Ramoji Rao: రామోజీరావు నటించిన ఏకైక చిత్రం ఏంటో తెలుసా?

Ramoji Rao: ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత రామోజీరావు తన జీవితం కాలంలో ఎన్నో విజయాలు సాధించారని చెప్పాలి. ఇలా ఒక వ్యాపారవేత్తగా సినీ నిర్మాతగా, పత్రికా రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నటువంటి రామోజీరావు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే.

ఈ విధంగా రామోజీరావు మరణించడంతో ఈయనకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రామోజీరావు ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ స్థాపించి ఎంతో మంది సెలబ్రిటీలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారందరూ కూడా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు అలాగే ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ఈయన జీవితం కల్పించారు.

నటనపై ఆసక్తి ఉండడంతోనే రామోజీరావు నిర్మాతగా మారడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైనటువంటి రామోజీ ఫిలిం సిటీని కూడా నిర్మించారు. ఇక్కడ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగులు జరుపుకుంటాయి అంటే ఏ స్థాయిలో ఈయన ఈ ఫిలిం సిటీని నిర్మించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.

న్యాయమూర్తి పాత్ర..
ఇలా నటనపై ఆసక్తి ఉన్నటువంటి రామోజీరావు సుమారు 94 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు అయితే ఈయన నిర్మాతగా మాత్రమే కాకుండా నటుడిగా ఒక సినిమాలో చిన్న అతిథి పాత్రలో నటించారు మరి ఈయన నటించిన సినిమా ఏంటి ఆ పాత్ర ఏంటి అనే విషయానికి వస్తే..యు. విశ్వేశ్వరరావు 1978లో నిర్మించిన ‘మార్పు’ సినిమాలో ఆయన న్యాయమూర్తి పాత్ర పోషించారు. అతిథి పాత్రలో నటించినప్పటికీ, సినిమా పోస్టర్లపై రామోజీరావు ఫోటోను ప్రచురించడం విశేషం.