Vishwambara: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. నటుడిగా ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత వరుస సినిమాలలో నటిస్తున్నారు. అయితే చిరంజీవి నటించిన సినిమాలలో వాల్తేరు వీరయ్య మినహా పెద్దగా ఏ సినిమాలో కూడా సక్సెస్ కాలేదని చెప్పాలి.
ఇటీవల కాలంలో చిరంజీవి సొంత కథలతో కాకుండా డబ్బింగ్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన సినిమాలపై భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు బాలయ్య వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతూ ఉండగా చిరంజీవి మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నారు . అయితే ఈ విమర్శలకు చెక్ పెట్టడం కోసం ఈయన విశ్వంభర సినిమా ద్వారా రాబోతున్నారు.
వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు సీనియర్ హీరోయిన్ల ఉండబోతున్నారని అలాగే చిరంజీవి చెల్లెలుగా మరొక హీరోయిన్ నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో మరో మెగా హీరో కూడా నటించబోతున్నారని తెలుస్తోంది.
వైష్ణవ్ తేజ్…
చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఇటీవల కాలంలో నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ గానే మిగిలాయి. అయితే ఈ సినిమాలో వైష్ణవ్ కూడా నటించబోతున్నారంటూ వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో లేదో తెలియదు కానీ ఎలాగైనా ఈ సినిమా సక్సెస్ అందుకోవడం కోసమే ఈ హడావిడి మొత్తం చేస్తున్నారని, పలువురు హీరో హీరోయిన్లు కూడా రంగంలోకి దింపుతున్నారని తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…