Fridge: ఫ్రిడ్జ్ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా…ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఫ్రిడ్జ్ పేలిపోతుంది తెలుసా?

Fridge: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ తప్పనిసరిగా ఉంటుంది.ఫ్రిడ్జ్ ప్రతి ఒక్కరికి ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఫ్రిడ్జ్ ఇంట్లో ఉండటం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి మనకు తెలిసిందే ఇలా నిత్యవసర వస్తువుగా మారిపోయినటువంటి ఫ్రిడ్జ్ విషయంలో కూడా మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున ప్రమాదాలను ఎదుర్కోవలసి ఉంటుందని తెలుస్తుంది.

మీ ఇంట్లో కనుక ఫ్రిడ్జ్ ఉన్నట్లయితే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు ఫ్రిడ్జ్ విషయంలో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి అయితే కొన్నిసార్లు ఫ్రిడ్జ్ పేలిపోతూ ఉంటుంది ఇలా ఫ్రిడ్జ్ పేలిపోవడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే… ఫ్రిడ్జ్ పేలిపోవడానికి ప్రధాన కారణం కంప్రెషర్. యూనిట్ వెనుక భాగంలో ఈ కంప్రెసర్ ఉంటుంది. ఇది పంప్, మోటారును కలిగి ఉండి.. కాయిల్ ద్వారా కూలింగ్ వాయును పంపిస్తూ ఉంటుంది అయితే కొన్నిసార్లు కంప్రెషర్ బాగా వేడి కావడం వల్ల కంప్రెషర్ కుచించుకుపోతుంది.

ఈ కంప్రెసర్ కాయిల్ లో ఎక్కువ వాయువు పెరిగి ఒత్తిడికి గురవుతుంది.ఇలా ఎప్పుడైతే ఒత్తిడికి గురవుతుందో ఆ క్షణమే ఫ్రిడ్జ్ పేలుతుంది అందుకే అప్పుడప్పుడు మనం ఈ కంప్రెసర్ కాయిల్ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. కేవలం కంప్రెషర్ కాయిల్ మాత్రమే కాకుండా మనం పవర్ సప్లై విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.

పవర్ సప్లైలో లోపాలు…

పవర్ సప్లై లో కూడా ఎక్కువ లోపాలు ఉన్న హెచ్చుతగ్గులు ఉన్నా కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిడ్జ్ పేలిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటాయి. అందుకే పవర్ సప్లై విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రిడ్జ్ మనం ఉపయోగిస్తూ ఎనిమిది సంవత్సరాలు దాటింది అంటే ఇలాంటి వాటిలోనే ఎక్కువగా పేలుడు జరుగుతూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఫ్రిడ్జ్ విషయంలో మీకు ఏదైనా సమస్య అనిపించినట్లు వెంటనే ఫ్రిడ్జ్ ప్లగ్ ఆఫ్ చేసి వెంటనే టెక్నీషియన్ ను పిలిపించి సమస్య ఏంటో గుర్తించడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలను అరికట్టవచ్చు.