Animal Movie: అర్జున్ రెడ్డి సినిమా ద్వారా రాత్రికి రాత్రి స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన సందీప్ రెడ్డి వంగ త్వరలోనే బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ సరసన రష్మిక మందన్న నటించిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కనుక చూస్తే ఈ సినిమా తండ్రీ కొడుకుల మధ్య నేపథ్యంలో కొనసాగుతుందని తెలుస్తుంది.
ఈ సినిమా ట్రైలర్ కనుక చూస్తే సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయని చెప్పాలి. అయితే ఈ సినిమా ట్రైలర్ చూస్తే కనుక ఎక్కడో చూసాము అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలగక మానదు. ఈ సినిమా ట్రైలర్ వెంకటేష్ హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ధర్మచక్రం సినిమాను తలపిస్తుంది. అచ్చం ఈ సినిమా కూడా తండ్రి కొడుకుల మధ్య ఉన్న రిలేషన్ నేపథ్యంలో రాబోతోంది. ఇక ఆ సినిమాలో వెంకటేష్ నటించిన విధంగానే ఈ సినిమాలో కూడా రణబీర్ యారిగెంట్ యాటిట్యూడ్‌తో కనిపించారు.
ధర్మచక్రం సినిమా కాపీనా..
ఇలా సందీప్ రెడ్డి ధర్మచక్రం సినిమా స్టోరీ లైన్ ద్వారానే యానిమల్ సినిమా స్టోరీ సిద్ధం చేశారని స్పష్టంగా అర్థమవడంతో పలువురు నెటిజెన్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ భారీ స్థాయిలో సందీప్ రెడ్డి పై ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా సందీప్ రెడ్డి అడ్డంగా బుక్ అవడంతో ఈయన పట్ల భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరి ఈ కాఫీ ఇష్యూపై సందీప్ రెడ్డి స్పందిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…