Movie News

Shivani Rajasekhar: మా ఇంటికి నేనే దరిద్రం.. నా జాతకమే అలా ఉందేమో.. శివాని రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్!

Shivani Rajasekhar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జీవిత రాజశేఖర్ గురించి పరిచయం అవసరం లేదు. అయితే వీరి కుమార్తెలు ఇద్దరు శివాని శివాత్మిక హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి మనకు తెలిసిందే. అయితే వీరిద్దరూ పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ మాత్రం కాలేకపోయారు. శివాని కోటబొమ్మాలి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు..

ఈ సినిమా ద్వారా ఈమె మొదటి హిట్ అందుకున్నారని చెప్పాలి. సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి శివాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నష్టజాతుకురాలని మా ఇంటికి నేను దరిద్రం అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. శివాని రాజశేఖర్ మాట్లాడుతూ శేఖర్ సినిమా సమయంలో తనకు కరోనా వచ్చింది. అయితే ఈ సినిమాలో తన తండ్రి కూడా నటించడంతో ఆయనకి కూడా కరోనా వచ్చింది.

నేను కరోనా బారిన పడడంతో నావల్లే నాన్నకు కూడా కరోనా వచ్చింది. కానీ నాన్నకు చాలా సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఆయన వెంటిలేటర్ పై వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని,శాచురేషన్ పూర్తిగా పడిపోయిందనీ తెలిపారు. ఇలా నాన్నని బెడ్ పై చూసి తనకు చాలా బాధేసిందని నాన్న ఈ పొజిషన్ కి రావడానికి తానే కారణం అంటూ ఎంతో ఏడ్చానని తెలిపారు.

నాన్నే నాకు ధైర్యం చెప్పారు…

నావల్ల నాన్నకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆలోచిస్తూ బహుశా నేను మా ఇంటికి దరిద్రురాలినేమో నా జాతకం బాగా లేకపోవడం వల్లే ఇలా నాన్నకు ఇలా జరిగిందేమో అంటూ ఎన్నో ఆలోచనలు చేసేదానిని అంటూ ఈమె తెలియజేశారు. ఇక నాన్న వెంటిలేటర్ పై ఉన్నప్పటికీ తమకు ఎంతో ధైర్యం చెప్పేవారని శివాని వెల్లడించారు. తాను గుండె దడ సమస్యతో బాధపడుతున్నాను అది నెలకు ఒకసారి మాత్రమే నాకు వచ్చేది. నాన్నే అందుకు ట్రీట్మెంట్ ఇచ్చేవారు. కానీ నాన్నకు అలా అయ్యేసరికి రోజుకు రెండు మూడు సార్లు అలాంటి సమస్యతో బాధపడ్డానని తనకు ఏమవుతుందోనని నాన్న నాకు చాలా ధైర్యం చెప్పారు అంటూ ఈ సందర్భంగా శివాని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago