Rathika: బిగ్ బాస్ కార్యక్రమం 12 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది 11వ వారం ఎలిమినేషన్ లేకపోవడంతో 12వ వారంలో ఏకంగా డబల్ ఎలిమినేషన్ అయింది. ఈ క్రమంలోనే శనివారం అశ్విని హౌస్ నుంచి బయటకు రాగా ఆదివారం రతిక ఎలిమినేట్ అయ్యారు. ఇలా ఈ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత నాలుగు వారాలకి రతిక ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు అయితే తిరిగి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరీ లోపలికి వెళ్లారు.
ఇలా ఆరవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినటువంటి ఈమె తిరిగి 12వ వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. మొదటి నాలుగు వారాలు కూడా ఈమె ఆటపై ఏమాత్రం శ్రద్ధ చూపకుండా ముచ్చట్లు పెట్టుకుంటూ గడిపారు. అయితే ఎలిమినేట్ అయి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా తన ఆట తీరులో ఏ మాత్రం మార్పు లేదు ఎప్పుడు చూడు ఆ శివాజీ బ్యాచ్ కి చెంచా గిరి చేస్తూ వారితో ముచ్చట్లు పెట్టుకోవడం జరుగుతోంది.
ఇలా తన ఆట తీరు సరిగా లేకపోవడంతోనే ఈమె నామినేషన్స్ లోకి వచ్చారని ఇక శనివారం అశ్విని ఎలిమినేట్ కావడంతో ఆదివారం తాను ఎలిమినేట్ అవుతానని రతిక ముందుగానే ఊహించిందని తెలుస్తుంది. ఇక నాగార్జున చివరిలో అర్జున్ రతిక ఉండడంతో ఏవిక్షన్ ఫ్రీ పాస్ వీరిలో ఎవరికైనా ఉపయోగిస్తావా ప్రశాంత్ అంటూ అడగడంతో ప్రశాంత్ తనను సేవ్ చేస్తారని రతిక భావించింది కానీ ఆయన మాత్రం నేను 14వ వారం వరకు ఈ ఫ్రీ పాస్ ఉపయోగించను అని చెప్పారు. దీంతో రతిక ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.
నేను ఆడక పోవడంతోనే పంపిస్తున్నారు..
ఇలా నాగార్జున రతిక ఎలిమినేట్ అంటూ అనౌన్స్ చేయడంతో ఈమె వెంటనే తనలో తాను బహుశా నేను ఆడలేదని నన్ను పంపిస్తున్నారేమో అంటూ అనుకుంటుంది. ఇలా హౌస్ లో కొనసాగుతున్నటువంటి రతికకు తాను ఎలాంటి పర్ఫామెన్స్ ఇవ్వలేదని అర్థమవుతుంది అందుకే ఆమె ఎలిమినేట్ అయిన నేను ఆడలేదని పంపిస్తున్నారు అంటూ కాంప్రమైజ్ అయిందని, ఎక్కడ కూడా ఫిజికల్ టాస్కులలో హుషారుగా పాల్గొనక పోవటమే ఆమె ఎలిమినేషన్ కి కారణమని చెప్పాలి.
నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…
చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…
ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…
తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…