Anchor Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే సుధీర్ రష్మీ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ మంచి స్నేహితులు అయినప్పటికీ వీరిద్దరు నిజ జీవితంలో కూడా ఒకటైతే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక వీరిద్దరూ కలిసి పలు కార్యక్రమాలలో పెద్ద ఎత్తున ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేయడంతో ఈ జోడి బాగుందని వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చాలామంది భావించారు అయితే తాజాగా యాంకర్ రష్మీ పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ ఒక వార్త వైరల్ గా మారింది. గత కొద్దిరోజులుగా ఈమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ పెళ్లి వార్తలకు చెక్ పెట్టాలని తన కుటుంబ సభ్యులు భావించారట.
ఇలా రష్మికి పెళ్లి చేయాలి అనే నిర్ణయాన్ని తమ కుటుంబ సభ్యులు తీసుకున్నారని అయితే ఈమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కూడా తమ సొంత రాష్ట్రమైనటువంటి ఒడిస్సాకు చెందిన వ్యక్తి అని తెలుస్తుంది. ఒడిస్సాలో ప్రముఖ వ్యాపారవేత్తతో రష్మీ పెళ్లి జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి త్వరలోనే రశ్మి తన పెళ్లికి సంబంధించిన ఈ విషయాన్ని అధికారకంగా కూడా వెల్లడించనున్నట్లు సమాచారం.
సుధీర్ ని కాదని వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైన రష్మి…
ఈ విధంగా రష్మీ పెళ్లి చేసుకోబోతుందని ఈమె ఒక వ్యాపారవేత్తకు భార్యగా వెళ్లనున్నారు అనే విషయం తెలియడంతో సుధీర్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలా మా అన్నకు అన్యాయం చేసి పెళ్లి చేసుకొని నీ దారి నువ్వు చూసుకుంటే మా అన్న ఏం కావాలి అంటూ పెద్ద ఎత్తున సుధీర్ అభిమానులు డిసప్పాయింట్ అవ్వడమే కాకుండా, సుధీర్ ని వదిలేయడం న్యాయం కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి రష్మి పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…