Renu Desai: టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ అలాంటి పాత్రలో నటించబోతున్నారా.. అసలు విషయం చెప్పిన నటి?

Renu Desai:రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నటిగా పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే. బద్రి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె పవన్ కళ్యాణ్ తో అదే సినిమాలో ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకున్నారు.ఈ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ నటించిన జానీ సినిమా తర్వాత ఈమె పూర్తిగా వెండితెరకు దూరమయ్యారు.

ఇలా వెండితెరకు దూరమైనటువంటి ఈమె కొన్ని రోజులపాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నప్పటికీ అనంతరం పవన్ కళ్యాణ్ తో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.ఇలా విడాకులు తీసుకున్న అనంతరం రేణు దేశాయ్ పూణేలో తన పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ అక్కడే ఉన్నారు. ఇలా నటిగా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పటివరకు ప్రారంభించలేదు.

ఈ క్రమంలోనే ఈమె రవితేజ హీరోగా నటిస్తున్నటువంటి టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.ఇదిలా ఉండగా తాజాగా రేణు దేశాయ్ ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందో సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

Renu Desai: అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కు కృతజ్ఞతలు…

ఈ సందర్భంగా రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో తాను హేమలత అనే పాత్రలో నటిస్తున్నానని తెలియజేయడమే కాకుండా తన పాత్రకు సంబంధించిన స్క్రిప్ట్ ను కూడా వెల్లడించారు. ఈ విధంగా ఈమె తన పాత్ర గురించి తెలియజేస్తూ హేమలత లవణంగారి వంటి స్ఫూర్తిదాయకమైన పాత్రలో నటించే అవకాశం తనకు కల్పించినందుకు దర్శకుడు వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు అంటూ ఈమె తన పాత్ర గురించి వెల్లడించారు. రేణు దేశాయ్ షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.