Tarun: తరుణ్ రీ ఎంట్రీ పై గుడ్ న్యూస్ చెప్పిన తల్లి రోజా రమణి.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

Tarun: సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు తరుణ్ ఒకరు. ఈయన నువ్వే కావాలి, నువ్వు లేక నేనులేను, ప్రియమైన నీకు వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి తరుణ్ ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈయన నటించిన చివరి చిత్రం 2018 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో,పోయిందో కూడా ఎవరికి జనాలకు తెలియదు. దాదాపు పది సంవత్సరాలుగా తరుణ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే ఈయన రీ ఎంట్రీ కోసం అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే తరుణ్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. స్టార్ హీరోల సినిమాలలో ఈయన కీలక పాత్రలో నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను తరుణ్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. అయితే తాజాగా తల్లి రోజా రమణి ఈయన రీ ఎంట్రీ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

రియల్ ఎస్టేట్ బిజినెస్..
ఈ సందర్భంగా రోజా రమణి మాట్లాడుతూ.. త్వరలోనే తరుణ్ మీ అందరికీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని మరొక సినిమా ద్వారా తరుణ్ మీ ముందుకు రాబోతున్నారని వెల్లడించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్లానింగ్స్ అన్ని చర్చలలో ఉన్నాయని ఈమె వెల్లడించారు. అయితే ఎలాంటి కథతో వస్తున్నారనే విషయాలను త్వరలోనే వెల్లడిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతమైతే తరుణ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ తో పాటు తమ ఫ్యామిలీ బిజినెస్ నన్ను చూసుకుంటున్నారని ఈమె వెల్లడించారు.