Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు నువ్వా నేనా అను పోటీపడేలా సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇలా పలువురు హీరోయిన్స్ పాన్ ఇండియా స్థాయిలో సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు అనే విషయం గురించి ఎప్పుడు సందేహాలు ఉంటాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి హీరోయిన్లలో అత్యధిక పాపులారిటీ సొంతం చేసుకున్నటువంటి హీరోయిన్ ఎవరు అనే విషయం గురించి ప్రముఖ మీడియా సంస్థ ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా అత్యంత ఆదరణ పొందినటువంటి టాప్ 10 సెలెబ్రిటీలను ప్రకటించారు. మరి ఈ సర్వేలో మొదటి స్థానంలో ఎవరు ఉన్నారనే విషయానికి వస్తే..
గత కొద్ది రోజులుగా ఎలాంటి సినిమా అవకాశాలు లేకపోయినా ఈ సర్వేలో మాత్రం సమంత మొదటి స్థానంలో నిలిచారు. ఈమె అత్యంత ఆదరణ పొందిన నటిగా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఇక రెండో స్థానంలో సీనియర్ నటి కాజల్ అగర్వాల్ ఉన్నారు. మూడో స్థానంలో అనుష్క నాలుగో స్థానంలో శ్రీలీల, అయిదవ స్థానంలో సాయి పల్లవి ఉన్నారు.
సినిమాలు లేకపోయిన మొదటి స్థానం..
ఇక 6 నుంచి 10 స్థానాల వరకు వరుసగా రష్మిక తమన్నా కీర్తి సురేష్, పూజా హెగ్డే, అనుపమ పరమేశ్వరన్ ఇలా ఈ ఐదుగురు చివరి ఐదు స్థానాలలో నిలిచారు. ఇక ఈ సర్వేలో సమంత మొదటి స్థానంలో ఉండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇటీవల కాలంలో సమంత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ మొదటి స్థానంలో ఉండటం విశేషం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…