Prabhas: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయినప్పటికీ తన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించలేదని ముఖ్యంగా పెళ్లి గురించి ఏమాత్రం పట్టించుకోవడంలేదని అభిమానులు తెగ ఫీల్ అయ్యారు.
ఇకపోతే ఇటీవల ప్రభాస్ త్వరలోనే తన జీవితంలోకి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ ఒక పోస్ట్ చేశారు. ప్రభాస్ ఇలా పోస్ట్ చేశారు అంటే తప్పనిసరిగా ఆయన తన పెళ్లి గురించి పోస్ట్ చేసి ఉంటారని అందరూ భావించారు. అయితే తాజాగా ప్రభాస్ ఆ పోస్ట్ చేసింది పెళ్లి గురించి కాదని తన సినిమా అప్డేట్ ఇవ్వడం కోసం చేశారని తెలిసి అందరూ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ నటించిన కల్కి సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఈ తరుణంలోని ప్రభాస్ కూడా సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారని తెలుస్తోంది.
బుజ్జి..
ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు ఓ మెషిన్ ఉంటుందట. దాని పేరు బుజ్జి అంట. సదరు బుజ్జిని నేడు (మే18 శనివారం) సాయంత్రం 5 గంటలకు పరిచయం చేయనున్నట్లు తెలియజేశారు. మరీ ప్రభాస్ బుజ్జి ఎవరు అనేది తెలియాలి అంటే మనం కూడా ఎదురు చూడాల్సిందే. అయితే ఈ విషయంలో మాత్రం అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారనే చెప్పాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…