”రోజ్ విల్లా” మూవీ రివ్యూ

రోజ్ విల్లా పేరు వింటేనే ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అని తెలుస్తోంది. పేరుకు తగ్గట్టుగానే ఇందులో ఎన్నో సస్పెన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. క‌న్న‌డ దియా ఫేమ్ దీక్షిత్ శెట్టి న‌టించిన సినిమా రోజ్‌విల్లా. రాజా ర‌వీంద్ర కూడా ఇందులో న‌టించారు. హేమంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మాత అచ్యుత్ రామారావు పి, చిత్ర మందిర్ స్టూడియోస్ బేన‌ర్‌పై నిర్మించారు. నేడు (అక్టోబర్ 1) విడుదలైన సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే.

కథ:
యువ జంట. డాక్ట‌ర్ ర‌వి (దీక్షిత్ సెట్టి), శ్వేత (శ్వేత వ‌ర్మ) తాము ఎంతో ఇష్ట పడిన ప్రాంతానికి కారులో ప్రయాణం చేస్తూ ఆ అందమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉండగా వారి కారు ఏదో సమస్య వస్తుంది. అయితే అది నక్సల్స్ ప్రాంతం కావడంతో పోలీసులు వచ్చి వారిని ఒక సురక్షితమైన గ్రామానికి తరలిస్తారు. ఈ క్రమంలో అక్కడ ఒక హోటల్ లో భోజనం చేస్తుంటారు మిల‌ట్రీ రిటైర్ అయిన సోల్‌మాన్ (రాజా ర‌వీంద్ర) త‌న భార్య హెలెన్‌తో (అర్చ‌నా కుమార్‌) తో ఆ రెస్టారెంట్ లోనే భోజనం చేస్తుంటారు. అయితే సోలమాన్ కి పొలమారడంతో డాక్టర్ రవి అతనికి చిన్న చిన్న చిట్కాలను చెబుతూ ఆరోగ్యం కుదుటపడి ఎలా చేస్తాడు. ఈ క్రమంలోనే ఈ కృతజ్ఞతతో సోలామాన్ తన ఇంట్లో జరిగే ఫంక్షన్ కు వీరిని ఆహ్వానిస్తాడు.ఆ ఇంటికి వెళ్లిన ఈ జంటకు అక్కడ వాతావరణ పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పటినుంచి విపరీతమైన ఆందోళనలు అసలు అక్కడ ఎందుకలా జరిగింది? ఏంటి? అనేది ఎంతో ఆసక్తికరంగా మారనుంది.

విశ్లేషణ:
ఒక సాధారణ కథను తీసుకొని ఎంతో భావోద్వేగమైన త్రిల్లింగ్ ఎమోషనల్ కథను తెరకెక్కించారు దర్శకుడు హేమంత్ఎంతో ఆసక్తికరమైన కథనంతో మొదలయ్యి భావోద్వేగమైన డైలాగులతో సినిమా నడుస్తుంది. ఇక వీరిలో రాజా రవీంద్ర అర్చన నటన అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది. ఎన్నో కీలక మలుపులతో ఎంతో ఉత్కంఠ భరితంగా ఆసక్తికరంగా ఈ సినిమా సాగనుంది.

సాంకేతికత:
త్రీల్లింగ్ సస్పెన్షన్ చిత్రానికి బొబ్బిలి సురేష్ సంగీతం అద్భుతంగా వచ్చింది. అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరింత హైలైట్ చేసింది. సినిమాటోగ్రాఫర్ అంజి సన్నివేశాలను వాస్తవికంగా తెరకెక్కించారు. శివ ఎడిటింగ్ ఎంతో మెరుగ్గా ఉందని చెప్పవచ్చు.పరిమిత బడ్జెట్ తో అపరిమిత చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులకు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. కేవలం కొడుకు కోసం తల్లిదండ్రులు పడే తపన ఎంతో ఎమోషనల్ గా ఉంది. ఎక్కడ విసుగు తెప్పించకుండా సస్పెన్స్ చివరిలో చెప్పి అందరికీ సినిమాపై ఆసక్తిని కల్పించారు.

రేటింగ్ 2.75/5