Divorce: భరణం కింద ఆమెకు రూ.5,555 కోట్లు చెల్లించాలట..! ఎవరు..ఎందుకో.. తెలుసా?

Divorce: భరణం కింద ఆమెకు రూ.5,555 కోట్లు చెల్లించాలట..! ఎవరు..ఎందుకో.. తెలుసా?

సాధారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు అనేవి వస్తుంటాయి..వాటిని వాళ్లు నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకొని సంసార జీవితాన్ని కొనసాగించాలి. కానీ కొంతమంది వీటిని బూతద్దం పెట్టి చూసి.. అతి పెద్దదిగా చేసి విడాకుల వరకు వెళ్తారు. అయితే ఇటీవల కాలంలో విడాకలు తీసుకునే దంపతలు సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

Divorce: భరణం కింద ఆమెకు రూ.5,555 కోట్లు చెల్లించాలట..! ఎవరు..ఎందుకో.. తెలుసా?
Divorce: భరణం కింద ఆమెకు రూ.5,555 కోట్లు చెల్లించాలట..! ఎవరు..ఎందుకో.. తెలుసా?

విడాకలు సమయంలో అమ్మాయికి భర్త తరఫును భరణం అనేది చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ భరణం అనేది భర్త స్థోమతను బట్టి ఉంటుంది. కాని ఇక్కడ చెప్పే విడాకుల భరణం చరిత్రలోనే అత్యంత ఖరీదైనది. దాని గురించి తెలుసుకుందాం.. దుబాయ్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్- మక్తూమ్‌ను తన మాజీ భార్య, యువరాణి హయా బింట్ అల్-హుస్సేన్‌కు 5వేల 555 కోట్లు విడాకుల భరణంగా ఇ‍వ్వాల్సిందేనని యూకేలోని లండన్‌ హైకోర్టు ఆదేశించింది.

ఆ వీడియోలో నిజం లేదు..దీప్తి నాకు ఎలాంటి హింట్ ఇవ్వలేదు..షణ్ముఖ్!

అయితే అత్యవసరంగా.. ముందుగా.. రూ.2,521 కోట్లు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. వాటి తర్వాత మిగిలిన మొత్తాన్ని మూడు నెలల్లో ఇవ్వాలని కూడా చెప్పింది. అంతే కాదు.. కోర్టు నుంచి తదుపరి తీర్పు వెలువరించే వరకు ఇద్దరు పిల్లలను.. వారి జీవితాంతం.. భద్రతా ఖర్చులను భరించాలని కూడా స్పష్టం చేసింది. దీంతో ఈ భరణం తీర్పు బ్రిటీష్ చరిత్రలోనే మొదటిసారి ఇలా వచ్చిందని చెబుతున్నారు. ఒక్క బ్రిటీష్ లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఇది అతి పెద్ద.. విడాకుల సెటిల్ మెంట్ గా ఇది నిలవనుంది.

Divorce: భరణం కింద ఆమెకు రూ.5,555 కోట్లు చెల్లించాలట..! ఎవరు..ఎందుకో.. తెలుసా?

అల్-మక్తూమ్ మాజీ భార్య ప్రిన్స్‌ హయా బింట్ జోర్డాన్ మాజీ పాలకుడు కింగ్ హుస్సేన్ కుమార్తె.. పైగా ప్రస్తుత పాలకుడు కింగ్ అబ్దుల్లా సోదరి. జూన్ 2019లో షేక్ అల్-మక్తూమ్ ఆరవ భార్య ప్రిన్సెస్ హయా బింట్ అల్ హుస్సేన్ తన పిల్లలతో సహా జర్మనీకి పారిపోయి విడాకులు కోరింది. అయితే ఆమె ఏ కారణంచేత ఇంటి నుంచి వెళ్లిపోయిందంటే.. ఆమె ఉంటున్న దర్భార్ లో ఆ రాజు.. మరొకరితో సన్నిహితంగా మెలుగుతున్నాడని.. అది తట్టుకోలేక ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది.

కానీ ఆ దుబాయ్ పాలకుడు..తన పిల్లలను ఇవ్వమని జర్మనీని కోరగా.. ఆ అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో దౌత్యపరమైన సమస్యలు తలెత్తాయి. ఈ మేరకు ఆమె తన భద్రత, స్వేచ్ఛ కోసం యూకే కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఆ కోర్టు పైన చెప్పిన విధంగా తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.