AP: సచివాలయాలు ఇకపై అన్నా క్యాంటీన్లగా మారబోతున్నాయా.. ఈ నిర్ణయం కరెక్టేనా?

AP: 2019 సంవత్సరంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రౌండ్ లెవెల్ లో అభివృద్ధి పనులను ప్రారంభించారు అన్నది వాస్తవం. ఒకప్పుడు చిన్న సర్టిఫికెట్ కావాలి అంటే మండల రెవెన్యూ ఆఫీస్ వద్దకు వెళ్లి రోజంతా ఒక విఆర్ఓ సంతకం కోసం ఎమ్మార్వో సంతకం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేవి. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువస్తానని ప్రతి గ్రామంలోనూ రెండు అంతస్తుల సచివాలయాలను నిర్మించారు.

కొత్తగా 1,20,000 మంది సచివాలయ ఉద్యోగులను తీసుకువచ్చారు. డేట్ అఫ్ బర్త్ నుంచి మొదలుకొని డెత్ సర్టిఫికెట్ వరకు సచివాలయంలోనే పనులు పూర్తి అయ్యేలాగా ఒక కొత్త వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారు. సచివాలయాలు వచ్చిన తర్వాత ఎమ్మార్వో ఆఫీస్ వైపు వెళ్లడం కూడా ప్రజలు మానుకున్నారు ఏ చిన్న అవసరం వచ్చినా సచివాలయం వద్దకు వెళ్లి నిమిషాలలో పనులు పూర్తి చేసుకునేవారు.

అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిచారు. ఇక ఈయన సచివాలయ ఉద్యోగస్తులు అందరిని కూడా ఆయా డిపార్ట్మెంట్ లోకి మార్చబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా సచివాలయాలలో అన్నా క్యాంటీన్లను పెట్టబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై పలువురు రాజకీయ విశ్లేషకులు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

పునరాలోచన చేయాలి..
అన్న క్యాంటీన్లను నిర్మించడం మంచి విషయమే పేదవారు కడుపునిండా భోజనం చేసే అవకాశం ఉంటుంది కానీ ఇలా ఎంతోమంది ప్రజలకు అవసరమయ్యే సచివాలయాలలో అన్న క్యాంటీన్లను నిర్మించడం అన్నది కరెక్ట్ కాదని ఈ విషయంపై చంద్రబాబు నాయుడు మరోసారి పునరాలోచన చేయడం మంచిదని పలువురు రాజకీయ విశ్లేషకులు ఈ విషయంపై వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి మీ అభిప్రాయాలు ఏంటో తెలియజేయండి.