Kirak Rp: కిరాక్ ఆర్పీ పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా గుర్తింపు పొందిన ఈయన ఇటీవల మాత్రం రాజకీయాల గురించి మాట్లాడుతూ సంచలనంగా మారారు. ఇటీవల కాలంలో కూటమికి మద్దతు తెలపడమే కాకుండా వైసీపీ నేతల పట్ల దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు.
ఈ క్రమంలోనే సంచలన తార శ్రీరెడ్డి గురించి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. శ్రీ రెడ్డి వైసీపీ నేతతో పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు ఈమె వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు అందుకు కారణం అని చెప్పాలి.
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి శ్రీ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి వ్యక్తికి ఒక్కరోజు భార్యగా ఉండి మరుసటి రోజు చచ్చిపోయిన పరవాలేదు నువ్వు మగాడివిరా బుజ్జి అంటూ ఆయన పై ప్రశంసల కురిపించింది అంతేకాకుండా భర్తగా తనకు అలాంటి వ్యక్తి రావాలి అంటూ పలు సందర్భాలలో బైరెడ్డి గురించి ఈమె ఈ వ్యాఖ్యలు చేయడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు హల్చల్ చేశాయి.
వన్ సైడ్ లవ్..
ఈ వార్తలపై స్పందించిన ఈమె నన్నంటే అన్నారు కానీ పాపం ఆ కుర్రాడు జీవితాన్ని నాశనం చేయొద్దు చిన్న పిల్లోడు అంటూ స్పందించారు. అయితే తాజాగా ఈ విషయంపై కిరాక్ ఆర్పీ స్పందిస్తూ శ్రీరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ప్రేమిస్తుంది. ఈమెది వన్ సైడ్ లవ్ కనుక వెళ్లి ప్రపోజ్ చేయాలని తెలిపారు. కూర్చుని పెళ్లి గురించి మాట్లాడాలని తెలిపారు ఎవరి ఇష్టం వారిది, వారి ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోవచ్చ అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై శ్రీ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…