Venu Swamy: తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. ఈ కార్యక్రమం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.ఇక తెలుగులో ఇప్పటికే 7 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం 8వ సీజన్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతోంది.
ఇక ఈ కార్యక్రమం ఎనిమిదవ సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమం సెప్టెంబర్ లో కాకుండా ఆగస్టులోనే ప్రసారం కాబోతోందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన కొన్ని పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి కూడా కంటెస్టెంట్ గా హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. ఈయన జ్యోతిష్యులుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే ఎక్కువగా సినిమా సెలబ్రిటీలో రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ వార్తలలో నిలిచారు.
కంటెస్టెంట్ గా వేణు స్వామి…
ఇటీవల కాలంలో ఈయన చెప్పిన జాతకాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈయనపై భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇలా విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నారు. కానీ ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు. ఈయన కనుక బిగ్ బాస్ లోకి వెళ్తే రచ్చ మామూలుగా ఉండదు అంటూ కామెంట్ లు చేస్తున్నారు. మరి ఈయన బిగ్ బాస్ లో పాల్గొనబోతున్నారంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…