పోలీసులే రాజును హత్య చేశారు.. అతడి కుటుంబ సభ్యుల ఆరోపణ..

సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన నిందితుడు రాజు కోసం గత వారం రోజులుగా పోలీసులు గాలించగా.. రైలు పట్టాలపై అతడి శవం కనిపించిన విషయం తెలిసిందే. అతడి చెయ్యిపై మౌనిక అనే పచ్చబొట్టు ఉండటంతో అతడే రాజు అంటూ పోలీసులు నిర్ధారించారు. అయితే రాజును పోలీసులే హత్య చేశారని రాజు కుటుంసభ్యులు ఆరోపిస్తున్నారు.

వాళ్లే అతడిని చంపేసి.. ఎవరికీ అనుమానం రాకుండా ఘట్ కేసర్ వద్ద రైలు పట్టాలపై పడేసినట్లు చెబుతున్నారు. అయితే.. రాజు తప్పుచేసి ఉండొచ్చు. కానీ అతడిని అరెస్టుచేసి .. నిజాలు నిర్ధారణ అయిన తర్వాత శిక్షలు విధించాల్సింది. అలా కాకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇలా చంపేసి.. ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కథ అల్లడం సరైంది కాదంటూ అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

రాజు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటూ వాళ్లు తెలిపారు. రాజు చిన్నారిని రేప్ చేశాడంటే తాము అస్సలు నమ్మే వాళ్లం కాదని.. కానీ ఇంట్లో ఆ చిన్నారి శవం కనిపించడంతో నమ్మాల్సి వచ్చిందని అన్నారు. ఇది ముమ్మాటికి పోలీసులే అతడిని హత్య చేసి ఉంటారని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియా సైట్లు యూజ్ చేయకపోవడం వల్ల కనుక్కొవడం అతడి ఆచూకీ కనుక్కోవడం కష్టంగా మారింది. నిందితుడిని పట్టుకునేందుకు బృందాలుగా విడిపోయి రాజు కోసం గాలించాయి.

కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు కీలక ప్రకటన కూడా చేశారు. రాజును పట్టిస్తే రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు రాజును ఎన్‌కౌంటర్ చేయాలనే డిమాండ్ పెరిగింది. మంత్రి మల్లారెడ్డి కూడా రాజును ఎన్ కౌంటర్ చేస్తామని తెలిపారు. వీటిని అన్నింటిని దృష్టిలో ఉంచుకొని రాజును ఎన్ కౌంటర్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అతడి బంధువులు వాదిస్తున్నారు.