Samantha: సమంత వస్త్రధారణ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తల్లి… ఏమన్నారంటే?

Samantha:టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర తారగా కొనసాగిన సమంత నాగచైతన్య పెళ్లి చేసుకొని కొన్ని సంవత్సరాల పాటు సంతోషంగా వైవాహిక జీవితంలో కొనసాగినప్పటికీ పలు కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు.అయితే పెళ్లికి ముందు సమంత సినిమాల విషయంలో గ్లామరస్ పాత్రల విషయంలో కొన్ని లిమిట్స్ పెట్టుకొని ఉండేది.ఇక అక్కినేని ఇంటికి కోడలు అయిన తర్వాత ఈమె పూర్తిగా తన కుటుంబ పరువును కాపాడటం కోసం వస్త్రధారణ విషయంలోనూ అలాగే తనను ఎంపిక చేసుకునే పాత్రల విషయంలో ఆచితూచి అడుగులు వేసేది.

అయితే నాగ చైతన్యతో ఎప్పుడైతే ఈమె విడాకులు తీసుకున్నారో అప్పటినుంచి పూర్తిగా తన వ్యక్తిగత జీవితాన్ని మరిచిపోయి తన దృష్టిని మొత్తం వృత్తిపరమైన జీవితంపై పెట్టీన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగడం కోసం సమంత తన పరిధులను చెరిపివేసింది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన హాట్ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. ఈ క్రమంలోనే నిత్యం సోషల్ మీడియా వేదికగా అందాల విందు చేస్తూ సమంత రెచ్చిపోతున్నారు. ఈ విధంగా గ్లామర్ షో చేయడం వల్ల తను మరి కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

మా పరువు తీయదు….

ఈ క్రమంలోనే సమంత వస్త్రధారణ విషయంపై తన బంధువులు తన తల్లిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సమంత తల్లి తన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు ఎప్పుడు పరిధులు దాటదని తను ఏ పని చేసిన బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందని, తను మా పరువు తీసే పనులు ఎప్పటికీ చెయ్యదు. తన నిర్ణయం పై మాకు నమ్మకం ఉందంటూ ఈమె తన కూతురు గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ అందరి నోటికి తాళం వేశారు. ఇలా సమంత గురించి తన తల్లి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.