Sekhar Master: ప్రభాస్ పవన్ సినిమాలకు పని చేయకపోవడానికి అదే కారణం.. వారి వల్లే అవకాశం కోల్పోయా: శేఖర్ మాస్టర్

Sekhar Master: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకరు. ప్రస్తుతం ఈయన ఇండస్ట్రీలో కుర్ర హీరోల నుంచి అగ్ర హీరోల వరకు తన స్టెప్పులతో అందరిని సందడి చేస్తున్నారు.ప్రస్తుతం శేఖర్ మాస్టర్ కెరియర్ పరంగా ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అదేవిధంగా ఒకవైపు కొరియోగ్రాఫర్ గా బిజీగా ఉండటమే కాకుండా మరోవైపు శేఖర్ స్టూడియో ద్వారా ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.

శేఖర్ మాస్టర్ స్టెప్స్ ఎంతో స్టైలిష్ గా ఉండడంతో ఈయన కొరియోగ్రఫీకి అందరూ అభిమానులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క సినిమాలో తప్పనిసరిగా ఈయనకు అవకాశం ఉంటుందని చెప్పాలి.ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి యంగ్ హీరోలు అందరికీ తాను కొరియోగ్రాఫర్ గా పనిచేశానని అయితే ప్రభాస్ పవన్ కళ్యాణ్ కి మినహా మిగిలిన హీరోలు అందరీ సినిమా కోసం తాను పనిచేశానని తెలిపారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రభాస్ సినిమాలకు కూడా తనకు అవకాశం వచ్చినట్టే వచ్చి, ఆ అవకాశాలు జారిపోయాయని శేఖర్ మాస్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు.పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో తనకు ఒక పాటకు కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చిందని తీరా ఆ పాట షూట్ చేసే సమయంలో టెక్నీషియన్ కు అనారోగ్యం చేయడం వల్ల తాను వేరే సినిమాకు కమిట్ అయ్యాను అలా ఈ సినిమా అవకాశం కోల్పోయిందని తెలిపారు.

Sekhar Master: తప్పకుండా వారితో సినిమాలు చేస్తా….

ఇక ప్రభాస్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన మిర్చి సినిమాకి తనకు అవకాశం వచ్చిందని శేఖర్ మాస్టర్ వెల్లడించారు.అయితే అప్పుడే తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరియర్లో ఎదుగుతుండడంతో కొరటాల శివ తనకు ఆ అవకాశం ఇవ్వలేదని అలా ప్రభాస్ సినిమా కూడా మిస్ అయిందని శేఖర్ మాస్టర్ తెలిపారు.అయితే వీరిద్దరితో ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో అయినా తప్పకుండా సినిమా చేస్తానని ఈయన ధీమా వ్యక్తం చేశారు.