RK Roja: వెండితెర నటిగా, బుల్లితెర న్యాయ నిర్ణేతగా, రాజకీయ నాయకురాలిగా మంత్రిగా ఎన్నో బాధ్యతలు చేపట్టి విశేషమైన ప్రేక్షకాదరణ గుర్తింపు సంపాదించుకున్న నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఇండస్ట్రీలో సుమారు 150 సినిమాలకు హీరోయిన్ గా పనిచేశారు. అలాగే రచ్చబండ జబర్దస్త్ వంటి కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.
ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో కూడా తన మార్క్ ఏంటో చూపించారు. ఇకపోతే మంత్రిగా ఈమె బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రోటోకాల్ ఫాలో అవుతూ జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో రోజా ఎంతో ఖరీదైన కోట్ల విలువ చేసే కారు కొన్నారు. ఈ క్రమంలోనే ఈ కారుపై ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
అయితే ఈ విషయంపై రోజా స్పందిస్తూ తాను ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నానని తాను ఇలా కోట్ల రూపాయల విలువచేసే కారు కొనడంలో ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని ఈమె తెలిపారు.తాను ఎలాంటి అక్రమ సంపాదనతో కొనలేదని కావలసి వస్తే తన ఇన్కమ్ టాక్స్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అంటూ సవాల్ విసిరారు.
ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల నుంచి యాంకర్లుగా పనిచేస్తున్న వారి పెద్ద పెద్ద ఆడి, బెంజ్, బీఎండబ్ల్యూ కార్లు కొనుగోలు చేస్తున్నారు. ఇలా చిన్నచిన్న యాంకర్లే ఖరీదైన కార్లలో తిరుగుతున్నప్పుడు తాను ఇలాంటి కారు కొనడంలో ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ విధంగా రోజా యాంకర్ల గురించి ప్రస్తావన చేయడంతో రోజా అన్నది ఏ యాంకర్ ని..ఈమె యాంకర్ మంజుషని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అంటూ చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే మంజూష ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే బెంజ్ కార్ కొనడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే రోజా ఈమెను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు భావిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…