పాడైపోయిన ఫుడ్ పెడుతున్నారని డిప్యూటీ తహసిల్దార్ ఆవేదన !

ఆంధ్రప్రదేశ్ లో కరోనా బాధితులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని ఏపీ సర్కార్ చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఓ కోవిడ్ ఆసుపత్రిలో వసతుల లేమిపై శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు డిప్యూటీ తహసీల్దార్ మురళీకృష్ణ సేల్ఫీ విడియో విడుదల చేసారు.

ఆసుపత్రిలో కరోనా చికిత్సకు సరైన డబ్బులు చెల్లించి తనతోపాటూ తన తల్లి కూడా ఆసుపత్రిలో చేరామని, అయితే అక్కడి సిబ్బంది తమను అస్సలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. పైగా పాడైన ఫుడ్ పెడుతున్నారని, వాటర్ బాటిల్ కూడా ఇవ్వడం లేదని అన్నారు. తానూ చేరేటప్పటికి డ్యూటీ డాక్టర్ కూడా రావడం లేదని చెప్పారు.