చలన చిత్ర పరిశ్రమలో గాయని గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సింగర్ సునీత.. ఈమె మధురమైన గాత్రంతో ఎన్నో పాటలు పాడి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది..ఇక తెలుగు ఆడియన్స్ లో ఆమెను ఇష్టపడనివారు లేరు. అయితే, ఆ ఇష్టాల్లో తేడా చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా సునీత సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె ఓ సినిమాకు డబ్బంగ్ చెప్పడానికి స్టూడియోకి వెళ్ళింది.
అప్పటికే ఆమె రాక కోసం ఎదురుచూస్తున్న ఆ సినిమా డైరెక్టర్ ఆమె రాగానే ఎదురువెళ్లి ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్లాడు.ఆ సయమంలో సునీతతో ఆ డైరెక్టర్ వ్యవహరించిన తీరుకు సునీత ఇప్పటికీ షాక్ గానే ఫీల్ అవుతూ ఉంటుందట. అసలు విషయాన్ని సునీత మాటల్లోనే.. ‘నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు సింపుల్ గానే వెళ్తాను. అలా నేను స్టూడియోలో అడుగుపెట్టాగానే ఆ సినిమా దర్శకుడు హాలో మేడమ్ అంటూ నన్ను రిసీవ్ చేసుకుని, నేను మీకు పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు.
మా పరిచయం పూర్తయ్యాక కాసేపు బాగానే మాట్లాడిన అతను, ఉన్నట్టు ఉండి వెంటనే నన్ను సునీత అని పిలవడం స్టార్ట్ చేశాడు. ఇక ఆ తరువాత కొన్ని డబ్బింగ్ సెషన్స్ ముగిసాక, అతని ప్రవర్తనలో చాల మార్పు వచ్చింది. చనువుగా మూవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఆ డైరెక్టర్ నాకు పలు సలహాలు ఇస్తూ మధ్యలో అరేయ్, కన్నా, బుజ్జి అని పిలవడం మొదలెట్టాడు. అల ఆ డైరెక్టర్ బాగా ఇబ్బంది పెట్టాడు..అసలు అతని మాటలు అతని ప్రవర్తన చూసి నాకు ఆశ్చర్యం వేసింది.
మేడం అని పిలుస్తూనే.. వెంటనే అరేయ్, బుజ్జి అంటూ ఎలా పిలుస్తున్నాడు అంటూ నేను షాక్ అయ్యాను. అతని ఉద్దేశ్యం ఏమిటో నాకు అర్ధం అయ్యాక, నాకు చిరాగ్గా అనిపించింది. అయితే, అక్కడి నుండి నేను వచ్చే వరకూ అతను నా వెంటే ఉన్నాడు. నా అదృష్టం ఏంటంటే దాని తర్వాత ఆ డైరెక్టర్ ను కలిసే అవకాశం రాలేదు’ అంటూ సునీత తనకు ఎదురైన చేదు సంఘటన గుర్తు చేసుకుంది..అయితే ఇన్ని విషయాలు చెప్పిన ఈమె.. ఆ డైరెక్టర్ ఎవరో మాత్రం బయటపెట్టలేదు.. దీంతో ఈమెను ఇబ్బంది పెట్టిన ఆ డైరెక్టర్ ఎవరా అని ఆరాతీస్తున్నారు కొందరు నెటిజన్లు…!!
తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కరుప్పు’పై ఇప్పటికే మంచి అంచనాలు…
వేసవి రాగానే ఇంట్లో ఉండటం చాలా మందికి సవాలుగా మారుతోంది. ముఖ్యంగా పై అంతస్తుల్లో నివసించే వారికి గదులు భగ్గుమంటూ…
దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న పుకార్లకు తెరదించిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయకుడు,…
ఇటీవల జీవనశైలిలో మార్పులతో పాటు కూర్చునే విధానాలపై కూడా ఆరోగ్య నిపుణులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లు మడిచుకుని ఎక్కువసేపు…
దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…