సినీ ఇండస్ట్రీలో శృంగార తారగా ఎనలేని కీర్తిప్రతిష్టలతో ప్రేక్షక లోకాన్ని తనదైన శైలిలో అలరించింది, ఆమెనే షకీలా. షకీలా సినిమాల్లో ఎంత బోల్డ్ నెస్ ఉంటుందో ఆమె వ్యక్తిగత జీవితంలోనూ అంతకన్నా బోల్డ్ సంఘటనలు ఉన్నాయి. ఎంతోమందిని ఆమె ప్రేమించింది, ఇక అంతకు మించి మరెంతోమంది ఆమెను ప్రేమించారు, కానీ షకీలాను అర్థం చేసుకునే మగాడు ఆమెకు దొరకలేదు.
అందుకే, ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా తనకు నచ్చే అతని కోసం కలలు కంటూ ఎదురుచూస్తూ ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన షకీలా తన ప్రేమ గురించి మళ్ళీ ఒక షాకింగ్ విషయం చెప్పింది. షకీలా ప్రస్తుతం ఒకరితో ప్రేమలో ఉందట. షకీలా మాటల్లోనే ‘అవును, ప్రస్తుతం నేను ఒకతనితో ప్రేమలో ఉన్నాను. తనకి కూడా నేనంటే ఎంతో ప్రేమ, నా పై చాలా ఇష్టం చూపిస్తాడు అని పరవశించిపోతూ.. ‘నిజంగా ప్రేమ అంటే ప్రేమ అంతే. ఇప్పటికే నాకు 43 ఏళ్లు దాటాయి.
అందుకే నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అయినా అతన్ని ప్రేమిస్తూనే ఉంటాను. ఈ వయసులో ప్రేమ ఏంటి అని ఈ సమాజం అనుకోవచ్చు. పైగా నా వయసు 43 అయితే, అతని వయసు కేవలం 30 మాత్రమే. నాకంటే అతను చిన్నవాడు. కానీ ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అని నేను నమ్ముతాను.ఇక అతనికి పెళ్లి కాలేదు.
ఒకవేళ నేను పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడి, అతని ఫ్యామిలీలో గొడవలకు కారణం అయితే అది నా తప్పు. పెళ్లి కానీ వ్యక్తిని ప్రేమిస్తే తప్పు ఎలా అవుతుంది ? అందుకే ఇద్దరం ప్రేమించుకుంటున్నాం’ అంటూ తనకు మాత్రమే సాధ్యమయ్యే బోల్డ్ కామెంట్స్ తో రెచ్చిపోయింది షకీలా. ఏది ఏమైనా షకీలా ఎవరితోనూ సీక్రెట్ రిలేషన్ పెట్టుకోదు. అంతా తెరిచిన పుస్తకమే. ఇప్పటివరకు ఆమె ఏడుగురితో రిలేషన్‌లో ఉందని..ఇతను ఎనిమిదవ వాడని స్వయంగా తెలిపింది శృంగార తార షకీలా..!!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…